
Fat: ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. క్రమశిక్షణ లేకుండా తినడం వల్ల పొట్ట, తొడలు, పిరుదులు వంటి శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనకు ఇబ్బందులు తెస్తోంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కొవ్వుతో ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అధిక బరువు వల్ల కాళ్లపై భారం పడుతుంది. దీంతో పిక్కలు, తొడలు, అరికాళ్లపై కూడా అధిక బరువు అనర్థాలు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో అధిక బరువును అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అధిక బరువు ఎందుకొస్తుంది?
ఇటీవల ఎవరిని చూసినా సన్నగా కనిపించడం లేదు. బొద్దుగా తయారవుతున్నారు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. సరైన ఆహార అలవాట్లు లేకుండా పోతున్నాయి. బేకరి ఫుడ్స్ కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందులో ఉండే ఉప్పు, చక్కెర, నూనె వంటివి అనర్థాలు తెస్తున్నాయి. క్రమ పద్ధతి లేకుండా మనం తీసుకునే ఆహారాలే ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటి వల్ల కూడా మనుషులు ఊబకాయులుగా తయారవుతున్నారు.
సరైన వ్యాయామం
ప్రస్తుతం ఎవరు కూడా వ్యాయామం చేయడం లేదు. రాత్రుళ్లు రకరకాల తిండ్లు తింటూ ఎంజాయ్ చేయడం తరువాత ఉదయం నిద్ర లేవకుండా ఉంటున్నారు. దీంతో కూడా ఊబకాయం బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాలుగా నష్టాలు తెస్తోంది. రాత్రి మనం తినే ఆహారం పడుకునే సమయానికి కనీసం మూడు గంటల ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కానీ ఆధునిక కాలంలో అర్థరాత్రి తినడం కూడా ఓ ఫ్యాషన్ గా చూస్తున్నారు. అందుకే ఊబకాయం బారిన పడుతున్నారు.
చిట్కా
అధిక బరువును అదుపులో ఉంచుకోవడానికి ఓ చిట్కా ఉంది. దీనికి గాను 50 గ్రాముల సోంపు, అర టీ స్పూన్ పసుపు, 25 గ్రాముల అవిసె గింజలు, 25 గ్రాముల జీలకర్ర, 25 గ్రాములు కరివేపాకు పొడి, 25 గ్రాముల కరక్కాయ పొడి, అర టీ స్పూన్ సైంధవ లవణం, రెండు చిటికెల ఇంగువ తీసుకోవాలి. ముందుగా అవిసె గింజలను వేయించుకోవాలి. తరువాత జీలకర్ర, సోంపును కూడా విడిగా వేయించాలి. ఒక జార్ లో వీటిని మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో రాత్రి భోజనం చేసిన తరువాత ఓ గంటకు తీసుకుంటే అద్భుత ఫలితం వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి?
గోరు వెచ్చని నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ఇది వాడే రోజుల్లో జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. ప్రతి రోజు ఒక గంట వాకింగ్ చేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల శరీర బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగేందుకు ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.