https://oktelugu.com/

Child Anger: మీ పిల్లలకు ఎక్కువ కోపం ఉందా? అయితే ఇలా నియంత్రించండి..

పిల్లల మీద ఉన్న ప్రేమతో వారు ఏది అడిగితే అది ఇవ్వాలి అనుకుంటారు. కానీ అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తుంటే వారు మొండిగా ప్రవర్తిస్తారు. ప్రతి సారి ఇలా చేస్తే మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు అర్థం చేసుకోరు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 8, 2024 / 09:11 AM IST

    Child Anger

    Follow us on

    Child Anger: పిల్లలకు తొందరగా కోపం వస్తుంటుంది. వీరి కోపం కూడా పెరుగుతూ ఉంటుంది. పిల్లలతో గొడవ పెట్టుకుంటారు. చిన్న విషయానికే చిరాకు పడుతుంటారు. వస్తువులు తీసి పడేస్తారు. అయితే వీరికి కోపం సహజమే. కానీ ఇది ఎక్కువ అయితేనే చాలా కష్టం. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందుకే తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లల కోపాన్ని నియంత్రించాలి.

    కోపం చెడ్డ కోణం..
    నిజానికి పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఏమి చేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల కోపాన్ని అదుపు చేసే టిప్స్ తల్లిదండ్రులకు తెలియాలి. అప్పుడే మీ పిల్లల జీవితం బాగుంటుంది. లేదంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోపం అనేది తప్పు అని తెలిసే రోజు వరకు ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి. అందుకే మీ పిల్లల కోపాన్ని మీరే కంట్రోల్ చేయాలి.

    అడిగింది ఇవ్వకూడదు.
    పిల్లల మీద ఉన్న ప్రేమతో వారు ఏది అడిగితే అది ఇవ్వాలి అనుకుంటారు. కానీ అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తుంటే వారు మొండిగా ప్రవర్తిస్తారు. ప్రతి సారి ఇలా చేస్తే మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు అర్థం చేసుకోరు. అంతే కాదు వారికి కోపం కట్టలు తెచ్చుకొని వస్తుంది. అందుకే వారు అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వకుండా.. కొన్ని సార్లు అర్థం అయ్యేలా చెప్పాలి.

    మీరు కూడా కోపం తెచ్చుకోవద్దు…
    పిల్లలు కోపంగా ఉన్నప్పుడు మీరు కోపంగా మాట్లాడకూడదు. వారికి కోపం వచ్చినప్పుడు మీరు కంట్రోల్ లో ఉండాల్సిందే. అంతేకాదు వారికి సున్నితంగా ప్రేమగా చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే. లేదంటే వారు దూకుడు స్థాయి పెరుగుతుంది.

    కోపం ఎక్కువైతే కంట్రోల్ చేయాలి.
    మీ పిల్లలు ఎక్కువ కోపంగా బిహేవ్ చేస్తుంటే.. వారిని కౌగిలించుకొని కలత చెందినప్పుడు వారి వీపు పై చేయి వేసి నిమరండి. కాస్త పెద్ద పిల్లలైతే వారి కోపాన్ని నియంత్రించడానికి కాసేపు సమయం కెటాయించండి.

    కావాలనే అలా చేస్తారు..
    కొన్ని సార్లు అడిగింది ఇవ్వనప్పుడు కావాలని కొన్ని విన్యాసాలు చేస్తుంటారు. అలగడం, కోపం వంటివి ప్రదర్శిస్తుంటారు. అలాంటప్పుడు వారిని పట్టించుకోకుండా ఉండడమే మంచిది. లేదంటే మరింత ఎక్కువ చేస్తారు.

    పిల్లల కోపాన్ని చిన్నప్పుడే కంట్రోల్ చేయాలి. మొక్కై వంగనిది, మానై వంగుతుందా? అందుకే పిల్లల కోపాన్ని చిన్నప్పుడే కంట్రోల్ చేయాలి. లేదంటే ఇదే కోపం కంటిన్యూ అయితే వారికి, మీకు ఇద్దరికి నష్టమే. అందుకే వారి కోపాన్ని కంట్రోల్ చేయడం మీ బాధ్యతనే..