https://oktelugu.com/

Wisdom tooth : జ్ఞాన దంతం తొలగిస్తే కంటి చూపు తగ్గుతుందా? ఇందులో నిజమెంత?

దంత సమస్యలు రాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలంటే వేప పుల్లతో బ్రష్ చేయడం మంచిది. ఇందులోని పోషకాలు దంతాలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో బాగా సాయపడుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 12:01 AM IST

    Wisdom Teeth

    Follow us on

    Wisdom tooth : సాధారణంగా కొందరికి పళ్లు నొప్పి వస్తుంది. బాగా చల్లగా ఉన్న పదార్థాలు ఏవైనా తింటే ఇంకా జివ్వుమంటుంది. అయితే పన్ను నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. కనీసం నోటిలో వేసుకుని ఏం తినలేరు. చిన్న పదార్థం తిన్న నొప్పి వస్తుంది. శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. దంతాల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరికి జ్ఞాన దంతాలు ఉంటాయి. వీటివల్ల నొప్పి ఉంటే వీటిని తొలగించేస్తారు. ఇలా జ్ఞాన దంతాలను తొలగించడం వల్ల సమస్యలు వస్తాయని కొందరు భావిస్తారు. ముఖ్యంగా కంటి చూపు తగ్గుతుందని అంటుంటారు. జ్ఞాన దంతాలు తొలగిస్తే నిజంగానే కంటి చూపు తగుతుందా? ఇందులో నిజమెంతో తెలియాలంటే పూర్తి స్టోరీ చదివేయండి.

    సాధారణంగా జ్ఞాన దంతాలు 18 నుంచి 21 ఏళ్ల మధ్య వారికి ఎక్కువగా వస్తాయి. ఇవి కాస్త బయటకు కనిపిస్తాయి. అయితే ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఈ జ్ఞాన దంతాల దగ్గర కొందరికి ఆహారం ఉండిపోతుంది. దీంతో చిగుర్లు నొప్పి వస్తుంది. దీంతో ఆహార పదార్థాలు తీసుకోలేరు. ఏం తిన్న నొప్పి రావడంతో దీన్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. దంతాలు తొలగిస్తే ఈ వయస్సులో మళ్లీ రావడం కష్టం. కొందరికి మళ్లీ దంతాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరికొందరికి పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే జ్ఞాన దంతాలు తీసిన తర్వాత కంటి చూపు తగ్గుతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది నిజం కాదని.. కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా జ్ఞాన దంతాలు నోటికి వెనుక ఉంటాయి. ఇవి దవడ ఎముకలో చిగుళ్లకు ఉంటుంది. ఈ జ్ఞాన దంతం ఉన్న భాగాన్ని మాత్రమే తొలగిస్తారు. దీనివల్ల కళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. జ్ఞాన దంతాలు వల్ల ఇబ్బంది పడితే తీసేయవచ్చు. వీటివల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    కొందరు సరిగ్గా బ్రష్ చేయరు. దీనివల్ల దంతాల సమస్యలు వస్తాయి. బ్రష్‌ను ఎక్కువ సేపు చేయకుండా తక్కువ సమయం మాత్రమే చేయాలి. పళ్లు మధ్య ఆహారం ఇరుక్కుని నొప్పిగా ఉంటే ఉప్పు నీటిని నోటిలో వేసి బయటకు వేయాలి. ఇలా చేస్తే దంతాల సమస్య తగ్గుతుంది. తెల్లగా కావాలని కొందరు బాగా పళ్లలను పాముతారు. దీనివల్ల దంతాలు తెల్లగా కావడం ఏమో కానీ.. అరిగిపోతాయి. కాబట్టి ఎక్కువ సేపు దంతాలను పామవద్దు. అలాగే బాగా చల్లగా ఉండే పదార్థాలు ఐస్‌క్రీమ్, ఐస్ వాటర్ ఎక్కువగా తీసుకోవద్దు. వాటి చల్లదనం తగ్గిన తర్వాత వీటిని తీసుకోవడం మేలు. దంత సమస్యలు రాకుండా స్ట్రాంగ్‌గా ఉండాలంటే వేప పుల్లతో బ్రష్ చేయడం మంచిది. ఇందులోని పోషకాలు దంతాలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో బాగా సాయపడుతుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.