https://oktelugu.com/

Credit Card: క్రెడిట్ కార్డు ఇస్తే షాపు వాళ్లు 2% Extra చార్జీ వసూలు చేస్తున్నారా? అస్సలు ఇవ్వకండి.. ఎందుకంటే?

బ్యాంకులు కొన్ని షాపుల వారికి వారి ట్రాన్సాక్షన్ బట్టి క్రెడిట్ కార్డుల స్వైప్ మిషన్ ను జారీ చేస్తాయి. ఈ క్రమంలో వారు నెలకు రూ.2 శాతం చెల్లించాలని తెలిపింది. అయితే కొన్ని షాపుల వారి ట్రాన్సాక్షన్ తక్కువగా ఉంటే వారి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 17, 2023 5:19 pm
    Credit Card

    Credit Card

    Follow us on

    Credit Card: నేటి కాలంలో చాలా మంది వద్ద క్రెడిట్ కార్డులు ఒకటికి మంచి ఉన్నాయి. ప్రతి వస్తువు కొనుగోలు కోసం క్రెడిట్ కార్డును వాడుతున్నారు. షోరూం నుంచి కిరాణం షాపు వాళ్లు క్రెడిట్ కార్డు స్వైప్ మిషన్లు అందుబాటులో ఉంచుకుంటున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి ఉచితంగానే స్వైప్ చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల వారు మాత్రం క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తే 2 శాతం ఎక్స్ ట్రా ఇవ్వాలని అడుగుతున్నారు. కొంతమంది అక్కడున్న వస్తువుల కోసం ఈ ఎక్కువ మొత్తాన్ని కాదనలేక ఇస్తున్నారు. మరికొందరు మాత్రం ఇతర దుకాణాలకు వెళ్లున్నారు. అయితే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే 2 శాతం చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గైడ్ లైన్స్ చెబుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    Reserve Bank Of India బ్యాంకు వినియోగదారుల సౌలభ్యం కోసం రకరకాల సూత్రాలను, నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను జారీ చేయడంపై పరిమితులను విధించింది. క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కనీసం రూ.16 వేలు ఖర్చు చేస్తాన్నారని పేర్కొంది. ఈ క్రమంలో వినియోగదారులపై క్రెడిట్ కార్డు భారం అతిగా పడితే రుణాలు చెల్లంచలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. ఇదే క్రమంలో స్వైప్ చేసే క్రమంలో వినియోగదారులకు ఎలాంటి ఎక్స్ ట్రా చార్జులు వసూలు చేయద్దని తెలిపింది.

    బ్యాంకులు కొన్ని షాపుల వారికి వారి ట్రాన్సాక్షన్ బట్టి క్రెడిట్ కార్డుల స్వైప్ మిషన్ ను జారీ చేస్తాయి. ఈ క్రమంలో వారు నెలకు రూ.2 శాతం చెల్లించాలని తెలిపింది. అయితే కొన్ని షాపుల వారి ట్రాన్సాక్షన్ తక్కువగా ఉంటే వారి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఈ చార్జీలను దుకాణం వారు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఎవరైనా క్రెడిట్ కార్డు మీద వస్తులు కొనుగోలు చేయడానికి వస్తే కొందరు చెప్పకుండానే 2 శాతం ఎక్స్ ట్రా వసూలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చెప్పి మరీ అదనపు వసూళ్లు చేస్తున్నారు.

    కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇలా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. క్రెడిట్ కార్డు మిషన్ ఎవరైతే వాడుతున్నారో.. వారే ఈ చార్జీలను భరించుకోవాలి. లేదంటే ఈ మిషన్ ను వాడకుండా ఉండాలి. అలా కాదని 2 శాతం కట్ చేస్తే వెంటనే ఆర్బీఐ వెబ్ సైట్ కు కంప్లైంట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వారికి ఫైన్ విధిస్తారు.అంతేకాకుండా కన్జూమర్ కు పరిహారం కూడా చెల్లించే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్ కార్డు లు వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.