Hair turns white: మానవ శరీర ఆరోగ్యంలో జుట్టు కూడా ప్రధానమే. ప్రస్తుత కాలంలో చాలామంది వయసుతో తేడా లేకుండా జుట్టు తెల్లబడుతుంది. అయితే శరీరంలో ప్రోటీన్ల శాతం తక్కువ కావడంతో జుట్టు తెల్లబడుతుందని కొందరు ఆరోగ్య నిపుణులు ఇప్పటికే తెలిపారు. కానీ మరికొంతమంది తెలుపుతున్న ప్రకారం జుట్టు తెల్లబడడం ఆరోగ్యకరమే అని అంటున్నారు. చిన్న వయసు వారు జుట్టు తెల్లబడగానే అనేక రకాలుగా ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వీరు అలా బాధపడాల్సిన అవసరం లేదని జుట్టు తెల్లబడడం అంటే ఆరోగ్యానికి లక్షణమే అని అంటున్నారు. మరి జుట్టు తెల్లబడడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
జుట్టు నలుపు లేదా గోధుమ రంగు ఉండడానికి మెలనిన్ అనే పదార్థం తో సంబంధం ఉంటుంది. శరీరంలో యాక్సిడెటివ్ స్ట్రెస్ పెరిగినప్పుడు ఈ కణాలు దెబ్బతిని జుట్టు తెల్లబడుతుంది. అయితే జుట్టు తెల్లబడగానే చాలామంది తమ శరీరంలో అనారోగ్యం ఏర్పడిందని అనుకుంటారు. కానీ శరీరంలోని క్యాన్సర్ కారకాలను నాశనం చేసే క్రమంలోనే జుట్టు తెల్లబడుతుందని కొందరు ఆరోగ్యాన్ని పనులు తేల్చారు. మానవ శరీరంలో వేలాది ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి డీఎన్ఏ ను దెబ్బతీసే క్యాన్సర్ కారకాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ కార్యకాలను ఎదుర్కొనేందుకు ఇమ్యూనిటీ సిస్టం రక్షణ చర్యలను ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా inferferon, reactive oxygen species అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తూనే కొన్నిసార్లు మెలనో సైట్స్ పై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం కారణంగానే జుట్టు తెల్లబడుతూ ఉంటుంది.
ఈ విషయాన్ని 2018 సంవత్సరంలో హార్వర్డ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా పరిశోధనలు చేసి నిర్ధారించారు. ముందుగా ఈ పరిశోధనలు ఎలుకలపై నిర్వహించారు. ఆ తర్వాత శరీరంలో స్వీయ రక్షణ చర్య అని గుర్తించారు. అయితే కొంతమంది జుట్టు తెల్లబడగానే తమకు ఏదో అనారోగ్యం అని అనుకుంటూ ఉంటారు. అలా భావించకుండా ఇవి క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే క్రమంలో తెల్లబడుతున్నాయని అనుకోవాలి. అయితే జుట్టు తెల్లబడే క్రమంలో ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
సాధారణంగా జుట్టు తెల్లబడడానికి పోషక లోపం, ఒత్తిడి, ధూమపానం, హార్మోన్ల సమస్యలు ఉంటాయి. జుట్టు తెల్లబడడానికి జన్యుపరమైన లోపం అని కూడా అంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త కణాలను ఉత్పత్తి చేసే క్రమంలోనే జుట్టు తెల్లబడుతుందని చెబుతున్నారు. ఒకవేళ జుట్టు తెల్లబడడానికి సహజమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా ఒత్తిడిని దూరం చేస్తూ ప్రశాంతమైన వాతావరణంలో గడపాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశాలు తక్కువగా ఉంటాయని కొందరు చెబుతున్నారు.