Peanuts: మనకు విటమిన్లు, ప్రొటీన్లు ఇచ్చే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై ఎన్నో అపోహలు కూడా ఉండటం సహజమే. జామకాయలు తింటే జలుబు చేస్తుందని చెబుతారు. జామకాయలో ఉన్న ప్రొటీన్లు ఏ పండులోనూ ఉండవు. అలాగే వేరుశనగ పప్పు తింటే బరువు పెరుగుతారని చెబుతున్నారు. ఇందులో కూడా వాస్తవం లేదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మనవారు మనకు అవసరమయ్యే వాటిపై ఏవో లేనిపోని నిందలు మోపుతూ వాటిని దూరంగా పెడుతున్నారు. ఇక తినకూడనివి మాత్రం సులభంగా తింటున్నారు.

పచ్చళ్లు తింటే ఎంత ప్రమాదమో అని తెలిసినా వాటిని మాత్రం లాగించేస్తున్నారు. ఇలా మనకు ఉపయోగపడే వాటిపై ఏవో ఆరోపణలు చేస్తూ అక్కరకు రాని వాటిని మాత్రం ఇష్టంగా తినడం గమనార్హం.
వేరుశనగలను తినడం వల్ల బరువు పెరుగుతారనే భయం అందరిలో కలిగిస్తున్నారు. దీంతో అధిక బరువు ఉన్న వారు వీటిని తీసుకునేందుకు భయపడుతున్నారు. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు.
వంద గ్రాముల వేరుశనగలో 567 కేలరీల శక్తి, 25 గ్రాముల ప్రొటీన్, 16 గ్రాముల కార్బోహైడ్రేడ్లు, 50 గ్రాముల కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఇంకా వేరుశనగలో ఫైబర్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లం దాగి ఉన్నాయి. పోషక విలువల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

వేరుశనగలో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ బరువు పెరిగేందుకు కాదనే విషయం చాలా మందికి తెలియదు. దీంతోనే చాలామంది అపోహలతో వాటిని తినకుండా దూరం పెడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
వేరుశనగ తినడం వల్ల ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఆహారం అతిగా తీసుకోలేరు. ఆకలిని నియంత్రించడంలో పల్లీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. బరువు తగ్గేందుకు ఇవి మంచి ఔషధంలా పనిచేస్తాయని వైద్యులు చెప్పడం గమనార్హం.
వీటిని పేదవాడి బాదం పప్పుగా పిలుస్తారు. బాదం గింజలకంటే చౌకగా లభించడంతో వీటికి ఆ పేరు పెట్టారు. మన దేశంలో విరివిగా పండించే పంటల్లో వేరుశనగ కూడా ఒకటి. ఇవి మన ఆరోగ్యాన్ని అన్ని విధాల కాపాడతాయి. రోజు వారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం ఉత్తమం. వీటిని కొంతమంది మాత్రం పరిమితిగా తినాలి. వేరుశనగలో అరచిన్, కొనారాచిన్ అనే రెండు ప్రొటీన్లు ఉండటతో అలర్జీ సమస్య ఏర్పడుతుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఇవి తినేటప్పుడు మాత్రమే అలర్జీలు వస్తాయని చెబుతున్నారు. దీంతో వేరుశనగలను తీసుకోవడం ఆరోగ్యానికి మందు లాంటిదే అని గుర్తుంచుకుంటే మంచిది.