Chocolates: చాక్లెట్లు అంటే ఇష్టం లేని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా ఇష్టంగా చాక్లెట్లు తింటుంటారు. అయితే సాధారణంగా చాక్లెట్లు తింటే కొందరు దంతాలు పాడవుతాయని చెబుతుంటారు. పెద్దవాళ్ల కంటే చిన్న పిల్లలకు ఎక్కువగా చెబుతుంటారు. ఎక్కువగా చిన్నపిల్లలకు చాక్లెట్లు తినవద్దని, దంతాలు పుచ్చిపోతాయని అంటారు. అయితే నిజంగానే అంటారా? లేకపోతే పిల్లలు తినకూడదని చాక్లె్ట్లు తినవద్దని అంటారా? అసలు చాక్లెట్లకి, దంతాలు దెబ్బతినడానికి కారణం ఏంటి? అనే పూర్తి విషయాలు కొందరికి తెలియదు. ఈ విషయాలను మనం ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా చూసుకోవాలి. చిన్న వయస్సులోనే దంతాలు దెబ్బతింటే కష్టమే. సాధారణంగా పిల్లలు బ్రష్ చేయరు. దీనికి తోడు ఉదయాన్నే లేచిన వెంటనే చాక్లెట్లు అంటారు. తల్లిదండ్రులు ఇవ్వకపోతే మారాం చేస్తుంటారు. పిల్లలను ఏడిపించడం ఎందుకని కొందరు తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్లు ఇస్తు్ంటారు. అయితే చాక్లెట్లు వల్ల దంత క్షయం బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే చాక్లెట్ల వల్ల నోరు ఎక్కువగా లాలాజలంతో ఉంటుంది. ఇందులో ఎక్కువ బ్యాక్టీరియా నిండిపోతుంది. దీనివల్ల పళ్లపై ఉండే ఎనామిల్ పొర పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ఎనామిల్ పొర దెబ్బతింటే ఇక దంత సమస్యలు తప్పకుండా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాక్లెట్లలో ఎక్కువగా ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పిల్లలు చాక్లెట్లు తిన్న తర్వాత కనీసం నోటిని శుభ్రం చేసుకోరు. సాధారణంగానే పిల్లలు సరిగ్గా బ్రష్ చేయరు. దీనికి తోడు చాక్లెట్లు తిన్న తర్వాత బ్రష్ చేయకపోతే దంతాల మధ్య నొప్పి ఏర్పడుతుంది. కేవలం చాక్లెట్లు తిన్న తర్వాతే కాకుండా ఏ ఆహారం తిన్నా కూడా వెంటనే నోటిని క్లీన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదా పిల్లలకు చాక్లెట్ తినే అలవాటు మానిపించాలి. తిన్న తర్వాత కూడా క్లిన్ చేసుకోవాలని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే చెప్పాలి. అప్పుడే వారికి చిన్న వయస్సులో దంత సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భోజనానికి ముందు కూడా దంతాలను శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు అయితే నోటిని క్లీన్ చేసుకోవడం లేకపోతే బ్రష్ చేయించడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే నోటిలోని బ్యాక్టీరియా అంతా బయటకు పోతుంది. అలాగే భోజనం తర్వాత కూడా నోటిని శుభ్రం చేయడం వల్ల క్రిములు అన్ని కూడా క్లియర్ అవుతాయి. దీంతో పాటు దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. అయితే పిల్లలకు కేవలం మోతాదులో మాత్రమే చాక్లెట్లు ఇవ్వాలి. ఎక్కువగా ఇవ్వడం వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ చాక్లెట్లు కంటే డార్క్ చాక్లెట్లు పిల్లలకు ఇవ్వడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయిని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎలాంటి బ్యా్క్టీరియా కూడా ఉండదు. పిల్లలకు రాత్రి నిద్రపోయే ముందు కూడా బ్రష్ చేసే విధంగా నేర్పించండి. దీనివల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.