Male Fertility: తిండి విషయంలో ఎన్నో అపోహలు వస్తున్నాయి. కొందరు కొన్ని తినొద్దని చెబుతుంటారు. మరికొందరేమో తింటే ఏం కాదని చెబుతున్నారు. దీంతో సామాన్యుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇటీవల కొందరు పచ్చళ్లు తింటే ఏం కాదని చెబుతుంటే పచ్చళ్లలో ఉండే ఉప్పు, నూనె మనకు నష్టమే అని వైద్యులు చెప్పడం గమనార్హం. తాజాగా బిర్యాణీ విషయంలో కూడా కొన్ని అభ్యంతర మాటలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టీఎంసీ నేత రవీంద్ర నాథ్ ఘోష్ బిర్యాణీ తింటే మగతనం తగ్గిపోతుందని చె్ప్పడం సంచలనం కలిగిస్తోంది. దీంతో బిర్యాణీపై చర్చకు దారితీస్తోంది. బిర్యాణీ ఎందుకు ఆరోగ్యానికి చేటు అనే దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రపంచంలోనే బిర్యాణీ ప్రేమికులు చాలా మంది ఉన్నారు. వారు అది తినకుండా ఉండలేరు. వారంలో కనీసం నాలుగైదు సార్లయినా బిర్యాణీ తింటేనే వారికి తృప్తి కలుగుతుంది. అలాంటి బిర్యాణీపై ఇప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే బిర్యాణీ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. బిర్యాణీ తినడం వల్ల పురుషుల్లో మగతనం తగ్గుతుందనే మాటలు బిర్యాణీ ప్రేమికుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో తాము తినాలా? వద్దా? అనే అనుమానంలో పడిపోతున్నారు.
బిర్యాణీలో వాడే మసాలాలతో దుష్ఫరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో బిర్యాణీ తినే వారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందని చెప్పడంతో ప్రస్తుతం బిర్యాణీ తింటే నిజంగానే నష్టం కలుగుతుందా అనే ఆలోచనలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిర్యాణీలో నిజంగానే మనకు నష్టం కలిగించే పదార్థాలు ఉంటున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్ లో బిర్యాణీ తింటే ఇన్ని అనర్థాలు వస్తాయని చెబుతుండటంతో ఇక బిర్యాణీ తినకూడదని అనుకుంటున్నారు. దీంతో మాంసాహారులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెప్పడం గమనార్హం.

కూచ్బెహార్ మున్సిపాలిటీలోని స్థానిక బిర్యాణీ దుకాణాన్ని బలవంతంగా మూసి వేయడం తెలిసిందే. అయితే అధికారులు మాత్రం క్లీనింగ్ ప్రక్రియలో భాగంగానే అక్రమ దుకాణాలను తొలగించే డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. బిర్యాణీ తినడం వల్ల కలిగే అనర్థాలపై ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. దీనిపై అనవసరంగా మాట్లాడటంతో బిర్యాణీ తినేవారు ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటంతో బిర్యాణీ తినేవారికి ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు. శాస్త్రీయ ఆధారాల్లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పలువురు సూచిస్తున్నారు.