Pragathi: తెలుగు ప్రేక్షకులకు ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో ఆమె ఒకరు. హీరోలు హీరోయిన్స్ కి తల్లి, అత్తగా, పిన్నిగా అనేక సినిమాలు చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… ప్రగతి కెరీర్ మొదలైంది హీరోయిన్ గా. 90లలో ప్రగతి కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఒంగోలు చెందిన ప్రగతి 1994లో విడుదలైన ‘వీటిలే విశేషంగా’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. కోలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. ఒక ఏడు సినిమాల్లో ప్రగతి హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా చేస్తున్న ప్రగతి సడన్ గా సీరియల్స్ వైపుకు మళ్లారు.

ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఉందట. తక్కువ వయసులో తల్లిగా చేయాల్సిన వచ్చిన ప్రగతి పరిశ్రమలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రగతి మాట్లాడుతూ… నేను 24ఏళ్ల వయసుకే తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. నా వయసున్న హీరోయిన్ కి తల్లిగా చేయడం బాధ అనిపించేది. చంద్రమోహన్ ఫ్యామిలీతో మాకు పరిచయం ఉంది. ఆయన భార్యను నేను ఆంటీ అని పిలిచే దాన్ని, అలాంటిది ఆయన భార్యగా చేయాల్సి వచ్చింది. ఆరోజు ఏడ్చుకున్నాను.
సెట్స్ కి రెండు జడలు వేసుకొని వెళితే… ఆమె ఏంటి జడలు వేసుకుంది. కొప్పు ముడి వేసుకోమని చెప్పండి అనేవారు. ఆ మాటలు విని తట్టుకోలేకపోయాను. మేకప్ రూమ్ కి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను, అని ప్రగతి చెప్పుకొచ్చారు. ఒక సినిమాలో రైన్ సాంగ్ చేయాలి. కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరం చెప్పాను. ఆ కారణంగా ఆ సినిమాను వదిలేశాను. ఆ సంఘటన తర్వాత సినిమాలు వదిలేసి సీరియల్ నటిగా మారానని ప్రగతి చెప్పుకొచ్చారు.

2002లో విడుదలైన బాబీ మూవీతో ప్రగతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బాబీ మూవీలో ప్రగతి మహేష్ అమ్మగా నటించడం విశేషం. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైపోయారు. ప్రగతి కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కఠిన కసరత్తులు చేస్తున్న జిమ్ వీడియోలు పోస్ట్ చేయడం ఆమెకు మహా సరదా. అలాగే డాన్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తారు. వాటిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటారు.