https://oktelugu.com/

Beer For Diabetes: బీర్లు తాగితే షుగర్ తగ్గుతుందా? ఎలా సాధ్యమంటే?

అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఓ అధ్యయనం నిర్వహించి వివరాలను వెల్లడించింది. బీర్లు తాగడం వల్ల గుండె సమస్యలు తొలిగిపోతాయి. రోజూ ఒకటిన్నర గ్లాసుల బీరు (సాధ్యమైతేనే) తీసుకోవడం వల్ల గుండె ప్రమాదాలను తగ్గిస్తుందట.

Written By:
  • Srinivas
  • , Updated On : September 8, 2023 / 06:04 PM IST

    Beer For Diabetes

    Follow us on

    Beer For Diabetes: వేసవి కాలంలో చల్లగా కావడానికి కొందరు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. మరి కొందరు బీర్లు తాగుతూ ఉంటారు. బీర్లు తీసుకోవడంపై రకరకాల వాదనలు ఉన్నాయి. వేసవిలో బీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురవుతారని కొందరు వాదిస్తున్నారు. కానీ అమెరికాకు చెందిన కొంత మంది వైద్యులు బీర్లు తాగడం ఆరోగ్యానికి ప్రయోజనమే అని అంటున్నారు. బీర్లు మోతాదులో తీసుకుంటే కొన్ని వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఆల్కహాల్ కంటే కూడా బీర్లు తాగడమే మేలని వీరు చెబుతున్నారు. ఇంతకీ అసలు విషయమేంటంటే?

    అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఓ అధ్యయనం నిర్వహించి వివరాలను వెల్లడించింది. బీర్లు తాగడం వల్ల గుండె సమస్యలు తొలిగిపోతాయి. రోజూ ఒకటిన్నర గ్లాసుల బీరు (సాధ్యమైతేనే) తీసుకోవడం వల్ల గుండె ప్రమాదాలను తగ్గిస్తుందట. అంతేకాకుండా వీరి ఆయుష్సు పెరుగుతుందని అన్నారు. ఆల్కహల్ లో ఉండే ద్రాక్ష రసం కంటే బీర్లలో ఉండే ప్రోటీన్లు ఎక్కువగా శరీరానికి మేలు చేస్తాయని అంటున్నారు. అందువల్ల అల్కహాల్ కంటే బీర్లే నయం అని అంటున్నారు.

    బీర్లు మోతాదులో తీసుకుంటే మధుమేహం వ్యాధి నుంచి కూడా దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వారినికి 14 గ్లాసుల బీరు తాగితే టైప్ 2 మధుమేహంతో బాధపడే చాన్స్ తగ్గుతుందట. ఎముకలు బలంగా ఉండాలంటే పాలు తాగమని చెబుతారు. ఎందుకుంటే ఇందులో కాల్షియం ఉంటుంది. అలాగే బీర్లలో ఉండే ప్రోటీన్ల వల్ల ఎముకలు దృఢంగా మారుతాయని చెబుతున్నారు. బఠానీలు, తృణధాన్యాలతో సమానంగా ఇందులో విటమిన్లు లభిస్తాయని అంటున్నారు.

    వయసు పైబడిన కొద్దీ చాలా మందికి దంతాల సమస్యలు వస్తాయి. కానీ బీర్లు తాగడం వల్ల దంతాల సమస్యలు రాకుండా ఉంటాయని అమెరికాకు చెందిన వైద్యులు చెబుతున్నారు. కావిటీస్, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా బీర్ వల్ల నశించి పోతుంది. దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్ల బీర్లు అలవాటు ఉన్నవాళ్లు తాగడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన వైద్యులు చెబుతున్నారు.