study : చాలామంది వ్యక్తిగత కారణాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల వల్ల చదువుకు కొంతకాలం దూరంగా ఉంటారు. ప్రస్తుతం పరిస్థితి బాగులేదనే కారణంతో చదువును పక్కన పెట్టి కొన్ని రోజులు ఉద్యోగం చేస్తారు. ఇలా చదువుకి ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తారు. చాలా విరామం తర్వాత అన్ని సర్దుకున్న తర్వాత మళ్లీ చదవడానికి ప్లాన్ చేస్తారు. ఎక్కువ విరామం తర్వాత మళ్లీ చదవడం కష్టమని చాలామంది నిరాశ పరుస్తారు. అయితే నియమాలు అన్ని కరెక్ట్‌గా పాటిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కొందరికి ఆ నియమాలేంటో పూర్తిగా తెలియవు. అన్నింటిని సరిగ్గా ప్లాన్ చేసుకుని చదివితే సాధ్యమే. అయితే మళ్లీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి సూచనలు పాటిస్తే విజయం సాధిస్తారో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత మళ్లీ చదవలేమని నిరాశ చెందవద్దు. అసలు చదువుకి, వయస్సుకు సంబంధమే లేదు. చదువు అనేది ఎవరైనా, ఏ వయస్సులో అయిన చదవచ్చు. చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్లీ చదవడానికి కారణం ఏంటో గుర్తు పెట్టుకుని చదవండి. చదువు మీకు ఎంత ముఖ్యమో తెలియాలి. అప్పుడే టైమ్ పాస్ చేయకుండా చదువుతారు. చదవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు వెంటనే ఒక ప్లాన్ ప్రకారం చదవండి. ముందే టైమ్ టేబుల్ వేసుకుని దానికి తగ్గట్లుగా చదవండి. రోజులో మీకు ఉన్న సమయం బట్టి ప్లాన్ చేసుకుని చదవాలి. ఏ సబ్జెట్ ఎంత సమయం చదవాలని అవగాహన ఉండాలి. ఒకేసారి ఎక్కువగా చదవకుండా పార్ట్‌లుగా డివైడ్ చేసుకుని చదవాలి. కొత్తలో చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయిన కూడా వెనకడుగు వేయకుండా చదవాలి.
చదవాలంటే ప్రతి ఒక్కరికి ఏకాగ్రత ఉండాలి. చుట్టూ ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటివల్ల ఏకాగ్రత విషయంలో ఇబ్బంది పడితే చూసుకోకుండా ఉండండి. ఒకే ప్లేస్‌లో గంటల తరబడి కూర్చుని చదవద్దు. ప్రతి గంటకి బ్రేక్ ఇవ్వండి. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురికారు. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కోని చదవడం కంటే వేకువ జామున లేచి చదవడం మేలు. ఈ సమయంలో చదివినవి తప్పకుండా గుర్తుంటాయి. అలాగే మెదడు పనితీరు మెరుగుపడాలంటే పజిల్స్, సుడోకు వంటి గేమ్స్ ఆడుతుండాలి. విషయం కొత్తది లేదా పాతది అయిన కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీకు చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో గుగూల్‌లో ప్రతిది దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో ఎన్నో కోర్సులు కూడా ఉన్నాయి. ఇలా కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే చదువు మీద ఆటోమెటిక్‌గా మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదువుతో పాటు ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. రోజూ ఉదయం, సాయంత్రం వేళలో యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుండాలి. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే మళ్లీ చదవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదివేటప్పుడు చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు చదివింది కూడా గుర్తు ఉంటుంది.