Rich : జీవితంలో డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విషయంలో ఒకరి కంటే ఒకరికి పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే అందరూ డబ్బు సంపాదించిన కొందరు మాత్రమే ధనవంతులుగా మారతారు. అందుకు వారు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉండడమేనని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. మిగతావారు అలవాట్లు పాటించకపోవడం వల్ల పేదవారుగానే మిగిలిపోతున్నారు. అయితే ఎంత కష్టపడినా కాసింత అదృష్టం ఉండాలని అంటారు. అదృష్టం గురించి ఆలోచించకుండా చేసే పని ప్రణాళికతో ఉండడం వల్ల కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ధనవంతులుగా కావాలని అనుకునేవారు కొన్ని ప్రణాళికలు వేసుకోవాలని అంటున్నారు. వాటి ద్వారా ముందుకు వెళ్లడం ద్వారా అదృష్టం దానంతట అదే వస్తుందని చెబుతున్నారు. అయితే ఆ ప్రణాళికలు ఏవో ఇప్పుడు చూద్దాం..
కొంతమంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు. కానీ అంతకుమించి ఎక్కువగా ఖర్చు చేస్తారు. చేతిలోకి కొంచెం ఎక్కువగా డబ్బు కనబడగానే విలాస వస్తువులు కొనుగోలు చేయాలని చెబుతారు. అలాగే కొందరు వ్యసనాల మారిన పడతారు. అయితే ఇలా కాకుండా సంపాదించిన డబ్బులు 50% కూడబెట్టుకొని 20 శాతం వ్యసనాలు లేదా ఖర్చులకు ఉపయోగించుకోవాలి. మిగతా 30% ఇంటికి అవసరమయ్యే దానికి సరిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల డబ్బు పొదుపుగా మారి తొందరగా ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది.
Also Read : ప్రపంచంలో ధనవంతులు.. టాప్–10లో భారతీయులు!
డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు.. దానిని వివిధ మార్గంలో పెట్టి రెట్టింపు చేయడమే ఇంపార్టెంట్ అని నేటి ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందువల్ల వచ్చిన డబ్బులు సాధారణ డిపాజిట్ కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడులో రూపంలో పెట్టి ఉంచాలి. ఇలా డబ్బు రెట్టింపు చేసే మార్గాలను ఆలోచించడం వల్ల తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
కొందరు అవసరాల కోసం మాత్రమే డబ్బులు సంపాదిస్తారు. మరికొందరు ఏదైనా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికోసం ఆదాయం సమకూర్చుకుంటారు. అలా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికోసం ముందుకు వెళ్లడంతో అధిక డబ్బును తొందరగా సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక లక్ష్యం కోసం పనిచేసే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా డబ్బు సంపాదనే లక్ష్యంగా ముందుకు వెళ్తారు. ఇలా లక్ష్యం ద్వారా వెళ్లడం వల్ల తొందరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.
కొంతమంది అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకున్న కొన్ని చిల్లర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అంటే చిన్న చిన్న మొత్తాలను ఊరికే విడిచి పెడుతూ ఉంటారు. ఇలా విడిచి పెట్టడం ద్వారా అవి పెద్ద మొత్తంలో నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ప్రతి రూపాయి అవసరమే అన్న విధంగా ప్రవర్తించాలి. ఇక్కడ ఎలాంటి విధంగా పొరపాటున అనవసరంగా డబ్బులు పోకుండా కాపాడుకోవాలి. అలా చేయడం వల్ల పొదుపు పెరిగి ఆదాయం నిల్వ పెరుగుతుంది.
Also Read : దరిద్రమంటే ఇదే.. క్లాసెన్ రనౌట్.. పాపం కావ్య
డబ్బు సంపాదించడానికి ఎప్పుడూ ఒకే పని కాకుండా రకరకాల పనులు చేస్తూ ఉండాలి. ఎందులో ఎక్కువ ఆదాయం వస్తుందో దానికోసం ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల తొందరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది.