Periods: పీరియడ్స్ సమయంలో దుర్వాసన వస్తుందా..?

పీరియడ్స్ సమయంలో జరిగే రక్తస్రావాన్ని బట్టి ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి శ్యానిటరీ పాడ్స్ ను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో లీకేజ్ సమస్యను దూరం చేసుకోవడంతో పాటు వెజైనా ఇన్ఫెక్షన్ల బారిన పడటం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

Written By: Suresh, Updated On : December 27, 2023 3:05 pm

Periods

Follow us on

Periods: సాధారణంగా మహిళలు ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు నెలసరి సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు మహిళలు సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యంగా బ్లీడింగ్ సమయంలో దుర్వాసన రావడంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా స్మెల్ రావడం వలన నలుగురిలో వెళ్లేందుకు కూడా అసౌకర్యానికి గురవుతుంటారు.

పీరియడ్స్ సమయంలో జరిగే రక్తస్రావాన్ని బట్టి ప్రతి నాలుగైదు గంటలకు ఒకసారి శ్యానిటరీ పాడ్స్ ను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో లీకేజ్ సమస్యను దూరం చేసుకోవడంతో పాటు వెజైనా ఇన్ఫెక్షన్ల బారిన పడటం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. అయితే కొందరు మాత్రం గంటల తరబడి ప్యాడ్ మార్చుకోకుండా ఉండిపోతారు. ఈ విధంగా ఉండటం వలన నెలసరి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్యాడ్ ను తరచూ మార్చుకుంటూ ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్యాడ్ కాకుండా కప్ వాడితే ప్రతి ఆరు నుంచి 12 గంటలకు ఒకసారి దాన్ని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే దుర్వాసన ను తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం మహిళలు ఎక్కువగా బయట దొరికే ప్యాడ్స్ నే వినియోగిస్తున్నారు. వీటిని తయారు చేసే సమయంలో రసాయనాలను ఎక్కువగా వాడతారని తెలుస్తోంది. దీంతో బ్లీడింగ్ తో రసాయనాలు కలిసినప్పుడు దుర్వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ప్యాడ్లను వాడటం కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇకపై వీటికి బదులుగా కాటన్ తో తయారు చేసిన ప్యాడ్స్ కానీ, మైక్రోఫైబర్ తో తయారు చేసిన వాటిని కూడా వినియోగించాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా లోదుస్తులు అపరిశుభ్రంగా ఉన్న నెలసరి సమయంలో దుర్వాసన వస్తుందని నిపుణులు అంటున్నారు. లోదుస్తులను ఎప్పటికప్పుడు మార్చుకోవడంతో పాటు వాటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. లేని పక్షంలో జననేంద్రియాల్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్ల ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంది.

పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో వచ్చే దుర్వాసనను కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంతమందిలో దుర్వాసన రావడం సర్వైకల్ క్యాన్సర్ కూ సంకేతంగా కూడా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వారికి అధిక రక్తస్రావం, ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించి సంబంధిత చికత్స చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.