https://oktelugu.com/

sleep : రాత్రి లేట్ గా పడుకొని ఉదయమే నిద్ర లేస్తున్నారా? ఇది మీకోసమే..

నేటి బిజీ లైఫ్‌ స్టైల్‌లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి వరకు పనిచేయడం, మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోవడం కామన్ గా చూస్తున్నాం. దీంతో ఆలస్యంగా నిద్రపోతున్నారు. తెలియకుండానే మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించలేని క్రమంలో ఒత్తిడి పెరిగుతుందట. ఇవి మాత్రమే కాదు పీరియడ్స్ సమస్య కూడా వస్తుంది అంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గూ, ఫ్లూ వంటివి వస్తాయి. మెదడు పనితీరు తగ్గుతుంది. రోజంతా బద్దకం, మహిళల్లో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి మాత్రమే కాదు మరికొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 11, 2024 / 08:13 AM IST

    sleep

    Follow us on

    sleep : రాత్రిళ్లు ఎలాంటి వర్క్ లేకున్నా కొందరు నిద్రపోరు. చాలా సేపు ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటితో సమయం గడుపుతుంటారు. దీంతో నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. అంటే ఏ అర్ధరాత్రి దాటాకనో నిద్రపోతారు. అయితే ఉదయం పూట మళ్లీ ఉద్యోగాలకు వెళ్లడం, వివిధ పనులు ఉండటం వల్ల కచ్చితంగా త్వరగా లేవాల్సిందే. అంటే రాత్రి ఆలస్యంగా పడుకొని, ఉదయం త్వరగా లేవడం కామన్ గా జరుగుతుంది. కానీ ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.

    దీర్ఘకాలిక వ్యాధులు: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తే మీరు నాణ్యమైన నిద్రను కోల్పోతారు. దీనివల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి.

    ఒత్తిడి: తగినంత నిద్రలేకపోతే సహజంగానే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల అధికమొత్తంలో కార్టిసాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మీలోని ఆనందాన్ని దూరం చేసి, అతి ఆలోచనలకు, మానసి రుగ్మతలకు కారణం అవుతుంది. ఆందోళన, టెన్షన్ లు పెరుగుతాయి. నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్ లోకి కూడా వెళ్లవచ్చు.

    జ్ఞాపకశక్తి: క్వాలిటీ స్లీప్ తగ్గడం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది. కొత్త నైపుణ్యాలు అలవర్చుకోవడం కూడా కష్టమే. అందుకే ప్రతి రోజు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు.

    కిడ్నీ: రాత్రి మేల్కొని ఉదయమే నిద్ర లేవడం వల్ల కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉంటుందట. శరీరంలోని రక్తప్రవాహం నుంచి వ్యర్థాలు, విషాన్ని ఫిల్టర్ చేసే కీలక అవయవం కిడ్నీలు. ఇవి పాడవ్వడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. నిద్రపోతున్నప్పుడు, మూత్రపిండాలు వాటంతటవే రిపేర్ చేసుకుంటాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయం చేస్తాయి. కానీ మనం తక్కువ సేపు నిద్రపోతున్నప్పుడు, కిడ్నీలకు ఈ పని చేయడం కుదరదు. నిద్రలేమి సమస్య మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది సో జాగ్రత్త.