Vastu Tips: వంటగదిలో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

వంటగది బాగుండాలి అని చాలా మంది మహిళలు తమ అభిరుచిని ఇక్కడ తెలియజేయాలి అనుకుంటారు. అందుకోసం రంగురంగుల పెయింట్ లు వేయిస్తారు. అయితే వంట గది వాస్తు ప్రకారం.

Written By: Swathi, Updated On : February 28, 2024 5:08 pm

Vastu Tips

Follow us on

Vastu Tips: వంటగదిలో లక్ష్మీమాతతో పాటు అన్నపూర్ణ మాత కూడా ఉంటుంది. అందుకే ఇల్లు మాత్రమే కాదు వంటగది కూడా శుభ్రంగా ఉండాలంటారు. ఆ ఆదిశివుడికే అన్నం పెట్టిన లోక మాత అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నానికి కూడా వాల్యూ ఇవ్వాలి అంటారు పెద్దలు. అయితే సాధారణంగా గదుల మాదిరి కాకుండా. వంటగదిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ఇంటిల్లిపాటి ఆరోగ్యం వంటగదిమీదనే ఆధారపడి ఉంటుంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండేది ఇక్కడే కాబట్టి వీటిలో ఏది తారుమారైన ఆరోగ్యం కూడా తారుమారు అవుతుంది. అందుకే కొన్ని వంట గది టిప్స్ చూసేయండి.

వంటగది బాగుండాలి అని చాలా మంది మహిళలు తమ అభిరుచిని ఇక్కడ తెలియజేయాలి అనుకుంటారు. అందుకోసం రంగురంగుల పెయింట్ లు వేయిస్తారు. అయితే వంట గది వాస్తు ప్రకారం.. కిచెన్ లో కొన్ని రంగులు అసలు వేయకూడదట. చాలా మంది డార్క్ కలర్స్ అంటే ఎరుపు, ముదురు రంగులు వేస్తుంటారు. అలాగే బ్లాక్, గోధుమ రంగు కూడా వేయకూడదట. లెమన్ ఎల్లో లేదా పాస్టెల్ గ్రీన్ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వీటి వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.

ధాన్యం కూడా దేవుడితో సమానం. కొంత మంది తెలియక ప్రస్తుతం కాలంలో టాయిలెట్ పై వంట గదిని కడుతున్నారు. ఇలా అసలు చేయకూడదు. వంటగదిలో స్పూన్లు, చాకులు, కత్తుల అవసరం ఉంటుంది. వీటిని అందుబాటులో ఉండేలా చూసుకుంటారు మహిళలు. అయితే పని చేసేటప్పుడు మీ ముందు కత్తులు, స్పూన్లు ఉండకుండా చూసుకోవాలి. పక్కన ఉన్న పర్వాలేదు. కానీ ముందు ఉండకూడదట.

చాలా మంది కిచెన్ లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ సర్దేస్తారు. అలా కాకుండా పాత్రలను వెస్ట్ లేదా సౌత్ వెస్ట్ దిశలో ఉంచుకోవాలి. వంటగదిలో ముఖ్యమైన వస్తువుల్లో మిక్సీ, ఫ్రిజ్, మైక్రోవేవ్ లు ఒకటి. వీటిని ఉంచడానికి సరైన ప్లేసులు కూడా ఉన్నాయి. మిక్సీని సౌత్ ఈస్ట్ జోన్ లో, ఫ్రిజ్ ను నార్త్ వెస్ట్ జోన్ లో ఉంచుకోవాలి. అవసరమైతే కిచెన్ లోపల నార్త్ వెస్ట్ జోన్ లో ఫ్రిజ్ ఉంచవచ్చు.