Fridge: వేసవికాలం రాగానే చల్లదనం కోల్పోవడానికి చాలామంది ఆడటం పడుతూ ఉంటారు. ఒకప్పుడు అందరి వద్ద ఆదాయం ఉండేది కాదు. దీంతో ఎక్కువమంది ఫ్రిడ్జ్ కొనుగోలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు చాలామంది తమ ఇంట్లో నిత్యావసరంగా ఫ్రిడ్జ్ ను ఉంచుకుంటున్నారు. అయితే దీనిని వాడకంలో చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఫ్రిడ్జ్ అనగానే చాలామంది ఇందులో చాలాధనం కోసం నీటిని ఉంచుకోవడంతో పాటు రకరకాల ఆహార పదార్థాలను ఉంచుకుంటారు. అయితే ఫ్రిడ్జ్ లో ఎప్పటికీ తేమ ఉంటుంది. అందువల్ల ఇందులో కొన్ని రకాల పదార్థాలను ఉంచడం వల్ల పాడైపోతూ ఉంటాయి. ఇందులో ఎలాంటి పదార్థాలు ఉంచాలో ముందే తెలుసుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా కొన్ని రకాల పదార్థాలు ఇందులో ఉంచడం వల్ల విష తుల్యంగా మారే అవకాశం ఉంది. మరి ఇందులో ఎలాంటి పదార్థాలు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లి:
ప్రతి వంటింట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లి కూరలతో పాటు ఇతర పదార్థాలలో వాడుతూ ఉంటారు. వెల్లుల్లి వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీనిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ఆరోగ్యం. లేకుంటే తీవ్రంగా నష్టపోతారు. వెల్లుల్లిని ఎప్పుడూ ఉపయోగించే ముందే దీని పొట్టు తీయాలి. అంతేగాని కొందరు వెల్లుల్లి పొట్టు తీసిన తర్వాత దానిని ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల ఇది పాడైపోతుంది. ఇలా పాడైపోయిన వెల్లుల్లి తినడం వల్ల అనారోగ్యాల పారిన పడే అవకాశం ఉంది.
అల్లం:
అల్లం వల్ల కూర రుచిగా మారుతుంది. అంతేకాకుండా అల్లంతో జీర్ణ క్రియ పొందుతుంది. శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతను అల్లం ద్వారా పొందవచ్చు. అయితే కొంతమంది అల్లం మార్కెట్లో నుంచి తీసుకోవాల్సిన తర్వాత పోట్టు తీసి నిలువ తీస్తారు. ఇంకొందరు అయితే ఇలా పొట్టు తీసిన అల్లాన్ని ఫ్రిజ్లో నిర్వహిస్తారు. అయితే అల్లంలో తేమ ఉంటుంది. ఇలా తేమ ఉన్న అల్లాన్ని ఫ్రిజ్లో ఉంచడం వల్ల ఇందులో బ్యాక్టీరియా చేరి పాడైపోతుంది. అంతేకాకుండా ఫ్రిజ్లో ఉంచిన అల్లాన్ని తినడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
అన్నం:
మిగిలిపోయిన అన్నంను ఫ్రిజ్లో ఉంచుతారు. అయితే ఒక్కరోజు ఫ్రిజ్లో ఉంచిన అన్నాన్ని తినవచ్చు. కానీ ఎక్కువ సమయం ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల ఇందులో బ్యాక్టీరియా చేరుతుంది. అందువల్ల ఎక్కువసేపు ఫ్రిజ్లో ఉన్న అన్నాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇవే కాకుండా తేమ కలిగిన ఇటువంటి పదార్థాలు అయినా ఫ్రిజ్లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరి పాడైపోతూ ఉంటాయి. అందువల్ల అన్ని రకాల పదార్థాలను ఫ్రిజ్లో ఉంచకూడదని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వేసవిలో ఎక్కువగా చల్లగా ఉండే నీరు తీసుకోవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అతిగా చల్లగా ఉండే నీరును తక్కువగా తీసుకోగలుగుతారు. దీంతో శరీరం డిఐటేషన్కు గురవుతోంది. అందువల్ల సాధారణ కూల్ గా ఉండే వీరును తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది.