Chicken Fridge: చికెన్ ను ఫ్రిజ్ లో పెట్టి తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

పూర్వ కాలంలో మనుషులు నిత్య ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారు ఎప్పటి ఆహారాన్ని అప్పుడే తయారు చేసుకొని తినేవారు. అంతేకాకుండా వారికి అప్పట్లో ఫ్రిడ్జ్ లు లేవు.

Written By: Chai Muchhata, Updated On : August 7, 2023 3:13 pm

Chicken Fridge

Follow us on

Chicken Fridge: చికెన్ అంటే ఎవరైనా ఇష్టపడి తింటారు. చికెన్ తో చేసిన ఏ వంటకం అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చికెన్ చేసిన వంటకాలు ఇంట్లో కంటే రెస్టారెంట్లలో ఇంకా బాగా ఉంటాయి. అందుకే చాలా రెస్టారెంట్లు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అయితే మనం హోటళ్లలో తినే ఫుడ్ గురించి తెలిస్తే అస్సలు తినరు. ఇంకోసారి అటువైపు వెళ్లరు. ముఖ్యంగా మనకు వడ్డించే చికెన్ అప్పుడే ఫ్రెష్ గా తయారు చేసిందా? లేక ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చారా? అనే విషయాన్ని గ్రహించుకోవాలి. అయితే ఫ్రిడ్జ్ లో నుంచి తెచ్చిన చికెన్ అయితే ఏం జరుగుతుందో తెలుసా?

పూర్వ కాలంలో మనుషులు నిత్య ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారు ఎప్పటి ఆహారాన్ని అప్పుడే తయారు చేసుకొని తినేవారు. అంతేకాకుండా వారికి అప్పట్లో ఫ్రిడ్జ్ లు లేవు. అందువల్ల పాడైపోయిన ఆహారాన్ని అస్సలు తీసుకునేవారు. కానీ నేటి కాలంలో చాలా వరకు నిల్వ చేసిన ఆహారమే లభ్యమవుతుంది. కొందరు నేరుగా చికెన్ సెంటర్ లోకి తీసుకునే ఓపిక లేక నిల్వ ఉంచిన మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఎప్పటికైనా ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవే కాకుండా రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు మనకు తీసుకొచ్చిన చికెన్ వంటకం పొగలు వస్తుంటుంది. దీనిని చూసి మనం చాలా ఫ్రెష్ గా ఉంటుందని మురిసిపోతుంటాం. కానీ ఒకసారి ఆ చికెన్ ను జాగ్రత్తగా పరిశీలించండి. దానిపై బూడిద కలర్ వస్తే అది పాడైపోయిన చికెన్ అని అర్థం. అలా గుర్తించగలిగితే మీరు అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల చికెన్ వంటకం తినే సమసయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.

ఇక చాలా మంది ఇంట్లో వండిన చికెన్ ను ఫ్రాడ్జ్ లో పెట్టి తరువాత తింటారు. ఇలా తినడం వల్ల మరో రోజు కూడా చికెన్ తో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు.కానీ ఇలా తినడం కూడా ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇలాంటి చికెన్ తినడం వల్ల వాంతులు, విరేచనాలు వస్తుంటాయి. అలాగే కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చికెన్ ను ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి.