https://oktelugu.com/

Chicken Roast : ఏంటి చికెన్ రోస్ట్ ఇలా కూడా చేస్తారా? వైరల్ వీడియో

ఒక జాయింట్ వీలర్ లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేసి.. దాని కింద బొగ్గుల కుంపటి నిర్మించారు.. ఆ జాయింట్ వీల్ తిరుగుతుంటే.. కింద ఉన్న మంటల వేడికి చికెన్ ముక్కలు కాలుతున్నాయి. వాస్తవానికి చికెన్ రోస్ట్ చేయాలంటే తక్కువలో తక్కువ ఒక గంట కచ్చితంగా అది మంట మీద ఉండాలి. కానీ ఇలా జాయింట్ వీలర్ పైన చికెన్ ముక్కలు ఉంచి దానిని తిప్పడం వల్ల.. అవి త్వరగా కాలడం లేదు.

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2024 / 11:14 PM IST
    Follow us on

    Chicken Roast : చికెన్ అంటే చాలామందికి ఇష్టం. అయితే అందులో చికెన్ రోస్ట్ అంటే చాలామంది లొట్టలు వేసుకుని తింటారు.. అలా చికెన్ రోస్ట్ చేయాలంటే.. ఎర్రటి మంట మీద కోడి శరీర భాగాలను కాల్చాలి. అలా కాల్చిన వాటిని వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడే ఆ రోస్ట్ ఫ్లేవర్ ఆస్వాదించగలం. అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఓ వీడియోలో చికెన్ రోస్ట్ వెరైటీగా ఉంది. దాన్ని తయారు చేసే విధానం న భూతో న భవిష్యత్తు అనే విధంగా ఉంది. పైగా ఈ వీడియో ఇప్పటికే 13 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది.

    ఒక జాయింట్ వీలర్ లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేసి.. దాని కింద బొగ్గుల కుంపటి నిర్మించారు.. ఆ జాయింట్ వీల్ తిరుగుతుంటే.. కింద ఉన్న మంటల వేడికి చికెన్ ముక్కలు కాలుతున్నాయి. వాస్తవానికి చికెన్ రోస్ట్ చేయాలంటే తక్కువలో తక్కువ ఒక గంట కచ్చితంగా అది మంట మీద ఉండాలి. కానీ ఇలా జాయింట్ వీలర్ పైన చికెన్ ముక్కలు ఉంచి దానిని తిప్పడం వల్ల.. అవి త్వరగా కాలడం లేదు. అవి కాలడానికి సరిపడా ఉష్ణోగ్రత అందడం లేదు. జాయింట్ వీలర్ తిరుగుతోంది కానీ.. చికెన్ మాత్రం కాలడం లేదు. ఇలాంటి యంత్రాలే ఇంకా కొన్ని అక్కడ అమర్చారు. అయితే అవి ఎంతవరకు కాలాయో.. ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి చెప్పలేదు. ఆ విషయాన్ని కూడా అందులో పేర్కొనలేదు. కాకుంటే ఈ వీడియో కొత్తగా ఉండటంతో 13 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.

    సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోకు చికెన్ ఫెయిర్ అనే క్యాప్షన్ ఇచ్చారు.. ఆ చికెన్ రోస్ట్ చేసే విధానాన్ని అమ్యూజ్ మెంట్ పార్క్ థీమ్ తో ఏర్పాటు చేశారు. చూడ్డానికి అదొక ఎగ్జిబిషన్ లాగా ఉంది. దీనిపై నెటిజన్లు రకరకాల స్పందనలు చేస్తున్నారు. కొందరేమో బాగుందని అంటే, మరికొందరేమో విమర్శలు చేశారు. ఫుడ్ ఇలా ఎందుకు తయారు చేస్తున్నారు? దానిని ఎలా తయారు చేయడం ఇంకా ఉద్దేశం ఏమిటి? ఇలా చేస్తే కొన్న వాళ్లకు అదనపు పోషకాలు ఏమైనా అందుతాయా? అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.. ఇలా అసాధారణ వంట తీరు పట్ల ఇంకొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విధానంలో చికెన్ రోస్ట్ కావాలంటే కచ్చితంగా మూడు లేదా నాలుగు గంటలు కచ్చితంగా మూడు లేదా నాలుగు రోజులు పడుతుందని.. ఓ యూజర్ కామెంట్ చేశాడు.. ఇది వంటా లేక బ్రెజిల్ కార్నివాలా అని మరో యూజర్ ప్రశ్నను సంధించాడు.