https://oktelugu.com/

Lord Shiva : శివుడి శిరస్సుపై చంద్రవంక ఎందుకు ఉంటుందో తెలుసా?

ఫలితంగా నీలకంఠుడు అనే పేరు శివుడికి స్థిరపడిపోయింది. ఆ విషం వల్ల శివుడి శరీరం అత్యంత వేడిగా మారిపోయింది. దానిని తగ్గించేందుకు చంద్రుడిని తల మీద ఉంచుకోవాలని శివుడిని దేవతలు వేడుకున్నారు. దానికి శివుడు అంగీకరించక పోయినప్పటికీ.. చంద్రుడి తెలుపు రంగు, చల్లదనం వల్ల విష ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని దేవతలు ఒప్పించారు. దీంతో శివుడు దానికి తల ఊపాడు. దీంతో అప్పటినుంచి శివుడి తల మీద చంద్రుడు కొలువుదీరాడు. అలా చంద్రుడి వల్ల శివుడి పై విష ప్రభావం కొంత తగ్గింది.

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2024 / 10:53 PM IST
    Follow us on

    Lord Shiva : శివుడు నిర్వికారి. ఎక్కడో స్మశానంలో ఉంటాడు. ఒళ్ళు మొత్తం బూడిద పూసుకుంటాడు. మొదటి మీద విబూది తో అడ్డంగా బొట్టు పెట్టుకుంటాడు. జులపాల జుట్టును ముడి వేసుకుంటాడు. అతని మెడలో నాగుపాము ఉంటుంది. చేతిలో త్రిశూలం, దానికి డమరుకం ఉంటుంది. ఒంటికి పులి చర్మం వస్త్రంగా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శివుడి శిరస్సు మీద చంద్రవంక ఉంటుంది. ఇంతకీ ఈ చంద్ర వంక ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

    క్షీరసాగర మధనం చేసే సమయంలో అమృతం తో పాటు విషం కూడా బయటికి వచ్చింది. దానిని స్వీకరించినందుకు దేవతలు భయపడ్డారు. అసురులు బెదిరిపోయారు. ఆ విషానికి సృష్టిని సైతం వినాశనం చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్రమాదం తెలుసుకొని దేవతలు మూకుమ్మడిగా పరమేశ్వరుని దగ్గరికి వెళ్లారు. కాపాడమని కోరారు. దేవతల మొర ఆలకించిన శివుడు.. ఆ విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు. ఆ విష ప్రభావం వల్ల అతని గొంతు నీలం రంగులో మారిపోయింది. ఫలితంగా నీలకంఠుడు అనే పేరు శివుడికి స్థిరపడిపోయింది. ఆ విషం వల్ల శివుడి శరీరం అత్యంత వేడిగా మారిపోయింది. దానిని తగ్గించేందుకు చంద్రుడిని తల మీద ఉంచుకోవాలని శివుడిని దేవతలు వేడుకున్నారు. దానికి శివుడు అంగీకరించక పోయినప్పటికీ.. చంద్రుడి తెలుపు రంగు, చల్లదనం వల్ల విష ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని దేవతలు ఒప్పించారు. దీంతో శివుడు దానికి తల ఊపాడు. దీంతో అప్పటినుంచి శివుడి తల మీద చంద్రుడు కొలువుదీరాడు. అలా చంద్రుడి వల్ల శివుడి పై విష ప్రభావం కొంత తగ్గింది.

    పురాణాల ప్రకారం దక్ష మహారాజుకు 27 మంది కూతుళ్లు. వారందరిని అనసూయ కుమారుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు తన కుమార్తెలందరిని ప్రేమగా చూసుకుంటాడని దక్షుడు భావించాడు. 27 మంది భార్యలు ఉన్నప్పటికీ వారిలో ఒక్క రోహిణి మీద మాత్రమే చంద్రుడు ఎక్కువ ప్రేమ చూపించేవాడు. దీంతో ఆ కుమార్తెలందరూ దక్షుడి వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. ఈ విషయంపై దక్షుడు చంద్రుడిని మందలిస్తాడు. అందర్నీ ఒకేలాగా చూసుకోవాలని కోరుతాడు. దానికి చంద్రుడు ఒప్పుకోడు. ఫలితంగా చంద్రుడిని దక్షుడు శపిస్తాడు. రోజురోజుకు వెలిగి చివరికి తగ్గి.. మొత్తానికి అంతర్ధానమవుతావని శపిస్తాడు. దీంతో దక్షుడి శాపానికి భయపడి చంద్రుడు తనకు విమోచనం కలిగించాలని బ్రహ్మ, విష్ణువును వేడుకుంటాడు. అయితే తమవల్ల కాదని వారు పరమశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయాలని సూచిస్తారు. అలా చంద్రుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు. శాపం గురించి తెలుసుకుంటాడు. అప్పటికే చాప ప్రభావం ఉన్న నేపథ్యంలో లోకకళ్యాణం కోసం 15 రోజులు వెలుగుతూ, 15 రోజులు క్షీణిస్తూ ఉండాలని వరం ఇస్తాడు. అలా పౌర్ణమి, అమావాస్య ఏర్పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక శంకరుడు చంద్రుడి భక్తికి మెచ్చి తన శిరస్సు మీద స్థానం ఇచ్చాడు అంటారు. ఇలా చంద్రుడు శంకరుడి శిరస్సు మీద ఉండటంవల్ల శివుడిని చంద్రశేఖరుడు అంటారు.