Vastu Tips: మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు కట్టుకోవాలంటే ముందు చూడాల్సింది వాస్తునే. దీంతో వాస్తు ప్రకారం తమ ఇంటిని నిర్మించుకోవాలని అందరు భావిస్తున్నారు. అందుకే వాస్తుకు అంతటి విలువ ఏర్పడుతోంది. కుటుంబంలో మంచి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలంటే వాస్తు పద్దతులు సక్రమంగా ఉండాలని నమ్ముతున్నారు. ఇందులో భాగంగానే ప్రతి విషయంలో వాస్తును నమ్ముకుంటున్నారు. ఇంటి కళ ముఖ ద్వారం మీదే ఆధారపడి ఉన్నందున దీన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వాస్తు ప్రకారం ఎలాంటి ఉపద్రవాలు ఉండకుండా చూసుకుని ఉత్తర, తూర్పు దిక్కుల్లోనే ఏర్పాటు చేసుకుంటారు.

ఎక్కువ మంది తమ ప్రధాన ద్వారాలు తూర్పు లేదా ఉత్తర దిశల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లో సంపదలు తులతూగాలంటే ప్రధాన ద్వారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇంటికి ప్రధాన ద్వారం ఈ రెండు దిక్కుల్లో ఉంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర దిక్కులు సురక్షితమైనవిగా అనుకుంటున్నారు. వాస్తు ప్రణాళిక ప్రకారం తమ ఇల్లు మంచి ఫలితాలు పొందాలంటే ఇవి పాటించాల్సిందే. ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడని చెబుతారు. అందుకే ఉత్తర ద్వారం అత్యంత శుభశకునంగా భావిస్తారు.
వాయువ్య దిశలో ప్రవేశ ద్వారం ఉంటే సంపద, ఆరోగ్యం కలుగుతుంది. ఇలా ఉంటే కుటుంబ యజమాని ఇంటికి దూరంగా చాలా కాలం సమయం గడుపుతాడు. పశ్చిమ ముఖ ద్వారం ఉంటే సాయంత్రం సూర్యుడితో పాటు సంపద కూడా వస్తుంది. పడమర దిశలో ముఖద్వారం ఉండాలనుకుంటే వాయువ్య దిశలో ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమం. ఇత్తడితో చేసిన పిరమిడ్ మరియు హెలిక్స్ ఉపయోగించి వాయువ్య ముఖంగా ఉండే దోషాన్ని దూరం చేసుకోవచ్చు.

దక్షిణం వైపు ఉన్న గృహాలు వివాదాలు, వాదనలు ఎదుర్కొంటారు. వాస్తులో చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రవేశ ద్వారం వద్ద గోడపై హనుమంతుడి చిత్రంతో కూడిన బైల్ ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో తలుపు ఉంటే లెడ్ పిరమిడ్ లేదా లెడ్ హెలిక్స్ ఉపయోగించి లోపాన్ని సరిచేసుకోవచ్చు. రత్నాలు మరియు పసుపు నీలమణి మరయు భూమి స్పటకాలు వంటి లోహాలు కూడా నైరుతి ముఖంగా ఉన్న ఇంటి వల్ల కలిగే ప్రతికూల శక్తిని తగ్గించుకోవచ్చు.