Kidney Health Tips: మన శరీరం బాగా పనిచేయాలంటే రక్త సరఫరా మెరుగ్గా ఉండాలి. లేకపోతే నష్టమే కలుగుతుంది. రక్త సరఫరాను నిరంతరం కొనసాగించే అవయవాలు కిడ్నీలు. ఇవి నిరంతరం మన ఐదు లీటర్ల రక్తాన్ని వడపోస్తూ మనకు ఆరోగ్యం చెడిపోకుండా చేస్తాయి. దీంతో కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీలు పనిచేయడం మానేస్తే రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో డయాలసిస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత ప్రమాకరం. మధుమేహం, రక్తపోటు జబ్బులున్న వారు వాటిని నియంత్రణలో ఉంచుకోకపోతే కిడ్నీల సమస్యలు వస్తాయి. అందుకే మనం కిడ్నీలను సరిగా ఉండేలా చేసుకునే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

షుగర్, బీపీ ఉన్న వారు నిరంతరం వాకింగ్ చేయాలి. సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. నిరంతరం నీళ్లు తాగుతుండాలి. మనకు ఏది లోపించినా కిడ్నీల సమస్యలు మొదలవుతాయి. దీంతో కిడ్నీలను సరైన విధంగా పనిచేసేలా ప్రేరేపించే ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇంకా పొగతాగే అలవాటు ఉన్న వారు వెంటనే ఆ అలవాటును దూరం చేసుకుంటేనే మంచిది. లేదంటే దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ఊపిరితిత్తులు, గుండె కూడా ప్రమాదంలో పడుతుంది.
మధుమేహం ఉన్న వారు చక్కెరను తీసుకోవద్దు. స్వీట్లు తినకూడదు. డయాబెటిస్ ఉన్న వారు దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచుకోకపోతే ప్రమాదమే. కిడ్నీలపై పెను ప్రభావం పడుతుంది. మాంసాహారం కూడా మితంగా తీసుకోవాలి. ప్రొటీన్లు ఉన్నాయని భావించి మాంసాన్ని అధికంగా తీసుకున్నా ప్రతికూలమే. కిడ్నీలు దెబ్బతింటాయి. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తంలో ఆమ్లం ఉత్పత్తి పెరిగితే కిడ్నీల ఆరోగ్యం క్షీణించడం ఖాయం.

కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలంటే నిద్ర కూడా ముఖ్యమే. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు సుఖవంతంగా నిద్ర పోతే కిడ్నీలు బాగుంటాయి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే కూడా కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. మంచినీళ్లు కూడా బాగా తాగాల్సిందే. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాని నీరు తాగడానికి కూడా బద్ధకంగా ఫీలయితే కష్టమే. కిడ్నీలు కొట్టేస్తాయి. దీంతో జీవితం నరకంగా మారుతుంది. నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలకు మంచిదే అని తెలుసుకోవాలి.
ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే దాని ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. ఇంకా జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇందులో సోడియంతో రక్తపోటు పెరిగి కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో ఎన్నో నష్టాలు వస్తాయి. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని కిడ్నీలు బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి.