https://oktelugu.com/

Best Mileage Cars: బైక్ లతో పోటీ పడుతూ 40 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కార్లు ఏవో తెలుసా?

దేశీయ కార్ల ఉత్పత్తిల్లో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. మూడు దశాబ్దాలుగా ప్రతీ నెలవారీ ప్యాసింజర్ల కార్ల విక్రయాల్లో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన కార్లను మరింత అప్ గ్రేడ్ చేస్తూ మైలేజీని పెంచే ప్రయత్నం చేస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2023 / 07:51 AM IST

    Best Mileage Cars

    Follow us on

    Best Mileage Cars: బైక్ కొనుగోలు చేయాలనుకునే చాలా మంది కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మొత్తం కన్వినెంట్ గా సుదూరం ప్రయాణించవచ్చు. ఆదాయంతో సంబంధం లేకుండా చాలా మంది సొంతకారును కలిగి ఉంటున్నారు. ఈ క్రమంలో కంపెనీలు సైతం మధ్యతరగతి పీపుల్స్ ను దృష్టిలో పెట్టుకొని వివిధ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. కారు కొనాలనుకునే వారు ప్రధానంగా మైలేజీ చూస్తారు. కానీ పెట్రోల్ ఫ్యూయెల్ కలిగిన కారు ఎక్కువ మైలేజీ ఇవ్వరు. అయితే ఇటీవల మారుతి సుజుకీ కంపెనీకి సంబంధించిన కొన్ని మోడళ్లలను అప్డేట్ చేస్తున్నారు. బైక్ తో పోటీపడీ 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించే కార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇంతకీ ఆ కార్లేవో చూద్దమా..

    దేశీయ కార్ల ఉత్పత్తిల్లో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. మూడు దశాబ్దాలుగా ప్రతీ నెలవారీ ప్యాసింజర్ల కార్ల విక్రయాల్లో మారుతి అగ్రగామిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో తన కార్లను మరింత అప్ గ్రేడ్ చేస్తూ మైలేజీని పెంచే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగామారుతి సుజుకీ కంపెనీ కొన్నికార్లను కేవలం మైలేజీ ప్రధానంగా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయబోతుంది.ఇవి కనీసం 40 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ప్రచారం చేస్తోంది.

    వీటిలో ఫస్ట్ గా ‘న్యూ జెన్ మారుతి సుజుకి స్విప్ట్’నిలుస్తుంది. మారుతి సుజుకీ నుంచి ఇప్పటికే స్విప్ట్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీనినే పూర్తిగా అప్డేట్ చేస్తూ ఇంటిరీయర్, ఎక్సీటీరియర్ డిజైన్ చేసింది. దీనిని ఇప్పటికే పలుమార్లు విదేశాల్లో పరీక్షించారు కూడా. 2024 ప్రారంభంలో జపాన్ లో గ్లోబ్ ఆరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఉత్పత్తులను ఇప్పటికే రెడీగా ఉంచింది. దీని ఫీచర్ విషయానికొస్తే 1.2 లీటర్ సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. మిడ్ స్పెక్, టాప్ ఎండ్ వేరియంటెట్లలో అందుబాటులో ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్ష్ తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ కలిగి ఉంది. ఇది 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదు.

    మారుతి నుంచే మరో మెగా కారు అందుబాటులోకి రాబోతుంది. అదే ‘న్యూ జెన్ మారుతి డిజైర్’. ఇది స్విప్ట్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొత్త తరం డిజైర్ లా కనిపిస్తుంది. హ్యాచ్ బ్యాక్ ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉంటాయి. దీనిని కూడా 2024లో ద్వితియార్థంలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మోడల్ సైతం 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.