Savings: ప్రస్తుత సమాజంలో పొదుపు ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఎన్ని ఖర్చులున్నా పొదుపు చేయడం అలవాటుగా చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. పొదుపు చేయడం అత్యవసరమే. జీవితంలో ఎదగాలంటే పొదుపు చేయకపోతే కష్టమే. ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో పొదుపు గురించి అందరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా దేశాల్లో ప్రజలు వారి వేతనాల్లో 75 శాతం పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. భవిష్యత్ లో వచ్చే అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం ఆనవాయితీగా మార్చుకుంటున్నారు.

ఏదైనా వాహనం కొనాలన్నా లగ్జరీలకు ఆలోచించకుండా తక్కువ ధరలో లభించేవి లేదా సెకండ్ హ్యాండ్ వి కొనేందుకు సిద్ధపడతాం. మనం ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నాం. ఉద్యోగులైతే వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. దీంతో భవిష్యత్ లో వచ్చే ఆపదలను తప్పించుకోవచ్చు. రాబోయే కాలంలో ఎదురయ్యే వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో కొంత పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది.
మనం సంపాదించే దానిలో కొంత మొత్తాన్ని ఆర్డీ, మ్యాచువల్ ఫండ్లలో పెట్టుబడిగా పెడితే మంచిది. కొంతకాలానికి అవి పెరిగి మనకు తోడుగా నిలుస్తాయి. ఒకవేళ అమ్మాయి ఉంటే వారి చదువుతోపాటు పెళ్లికి అయ్యే ఖర్చులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. సంపాదనలో కొంత ముందు చూపుతో కొంత మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం కూడా మంచిదే. ఇకా సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో చేరడం వల్ల ఆందోళన తగ్గుతుంది. భవిష్యత్ పై బెంగ ఉండదు. వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.

మనకు వచ్చే ఆదాయంలో కొంత మేర పొదుపుచేసి భూములు కొనడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. భూముల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయి. దీంతో మనం కొన్న భూమి ఐదారేళ్లలో డబుల్ రేటు పలకవచ్చు. ఏదైనా అత్యవసరం అయితే వాటిని అమ్మేసుకుని అవసరాలు తీర్చుకోవచ్చు. ఇంకా అనారోగ్యాలు వస్తే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్బాలు వస్తే ఉన్న వాటిని అమ్మేసుకుని ప్రాణం కాపాడుకోవచ్చు. ఇంకా ఆరోగ్య బీమా వంటివి కూడా చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటే మంచి పరిణామాలు వస్తాయి.