
Tooth Decay: ప్రస్తుత కాలంలో మనకు ఆరోగ్య సమస్యలు కలవరపెడుతున్నాయి. వయో బేధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్యాలు వెంటాడుతున్నాయి. మన ఆహార అలవాట్లే మనకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. పూర్వకాలంలో వందేళ్లు వచ్చినా దంతాల సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకు సైతం దంత క్షయం సమస్య ఉంటోంది. దీంతో వారు రకరకాల మందులు వాడుతూ ఉపశమనం పొందుతున్నా శాశ్వత పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో దంత సమస్యలను నివారించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుని వాటిని ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
పళ్లు పుచ్చిపోకుండా..
దంతాలు పుచ్చిపోకుండా ఉండాలంటే మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. పంచదారతో చేసిన స్వీట్లు, చాక్లెట్లు, మైదా పిండితో చేసినవి, శీతల పానీయాలు, టీ, కాఫీలు వంటి వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. కానీ ఇటీవల ఇలాంటి పదార్థాలే ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో పళ్లకు సమస్యలు వస్తున్నాయి. దంతక్షయం ఏర్పడిన తరువాత డాక్టర్ల వద్దకు వెళ్లుతున్నారు. ఇంగ్లిష్ మందులు వాడుతున్నారు. మనం చేసే తప్పులే మనకు నష్టాలు తెస్తున్నాయని తెలుసుకోవడం లేదు.
పరిష్కారమేంటి?
దంతక్షయం సమస్యకు పరిష్కారముందా. ఆయుర్వేదంలో మనకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. రాత్రి భోజనం చేసిన తరువాత చెరుకు ముక్కలను తినడం వల్ల దంత క్షయం సమస్యకు చెక్ పడుతుంది. చెరుకు ముక్కలు నమలడం ద్వారా దంతాలు, చిగుళ్లు తాజాగా తయారవుతాయి. చెరుకు నమిలేటప్పుడు ఇందులో ఉండే ఫైబర్ దంతాలను శుభ్రం చేస్తుంది. దంత క్షయానికి కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను నశింపచేసే యాంటీ ఆక్సిడెంట్లు చెరుకులో అధికంగా ఉండటంతో మనకు రక్షణగా నిలుస్తుంది.

ఏం తినాలి?
దంతక్షయం సమస్య ఉన్న వారు మొలకెత్తిన విత్తనాలు, దానిమ్మ గింజలు, తాజా పండ్లు, కొబ్బరి, ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, నారింజ తొనలు తింటే ఎంతో మంచిది. దంతాలకు గార పట్టకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నోట్లో ఊరే లాలాజలమే దంతాలకు సమస్యలు రాకుండా చేస్తుంది. చెరుకు నమలడం ద్వారా దంతాలు పుచ్చిపోకుండా ఉంచేందుకు తోడ్పడుతుంది. దంతాలు పుచ్చిపోయిన తరువాత బాధ పడటం కంటే ముందే చెరుకును తీసుకోవడం ద్వారా దంతక్షయం సమస్య నుంచి దూరం కావచ్చు.
