
Dinner: ప్రతి వ్యక్తి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేయడం సహజమే. ఉదయం అల్పాహారంలో ఏం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలి. రాత్రి మనం తీసుకునే డిన్నర్ ఎలా ఉండాలనేదానిపై మనకో క్లారిటీ ఉంటే సరిపోతుంది. ఏది పడితే అది తింటూ కడుపును కీకారణ్యం చేసుకోకూదు. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు నష్టం చేసే వాటిని కాకుండా లాభం చేకూర్చే పదార్థాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. దీంతో మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ నేపథ్యంలో మనం తీసుకునే ఆహారమే మనకు ప్రతిబంధకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఏడు లోపే..
రాత్రి ఏడు తరువాత తినకూడదు. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న దాని ప్రకారం డిన్నర్ ఏడు లోపు పూర్తి చేస్తేనే మనకు సరైన నిద్ర పడుతుంది. దీంతో మన రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. అంతేకాని ఏడు తరువాత ఇష్టమొచ్చిన రీతిలో తినడం మూలంగా కష్టాలు రావడం ఖాయమే. రాత్రి భోజనంలో మనం తేలిగ్గా జీర్ణమయ్యే వాటినే తీసుకోవాలి. ఎందుకంటే రాత్రి సమయంలో కడుపు విశ్రాంతిని కోరుకుంటుంది. అదే మనం ఆయిల్ ఫుడ్ తీసుకుంటే లివర్ తెల్లవార్లు మరమ్మతులు చేసుకోవడానికే సమయం సరిపోతుంది. ఇక రెస్ట్ ఎక్కడ తీసుకుంటుంది.
యాపిల్ తో..
రాత్రి పూట మనం తీసుకునే ఆహారాల్లో యాపిల్, పీనట్ బటర్ కాంబినేషన్ అదురుతుంది. ఇందులో 8 గ్రాముల ప్రొటీన్, 7 గ్రాముల ఫైబర్ లభించడంతో జీర్ణ వ్యవస్థకు భంగం కాదు. 200 గ్రాముల పెరుగును తీసుకోవచ్చు. ఇందులో 15 నుంచి 20 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. రాత్రి సమయంలో ఓ కప్పు గ్రీక్ యోగర్్ తినడం మంచిదే. రాత్రి పూట తినేందుకు మనకు అనువైన వాటినే ఎంచుకోవాలి. లేదంటే మన కడుపు తెల్లవార్లూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మొలకెత్తిన విత్తనాల్లో..
మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఆ సమయంలో వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ శక్తి లభిస్తుంది. పైగా ఆకలి వేయదు. పోషకాలు పుష్కలంగా ఉండటంతో వీటిని ఆహారంగా చేసుకోవడం ఉత్తమమే. క్యారెట్, బెల్ పెప్పర్స్ తో కలిపి బ్రోకలీ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి అందాల్సిన బలం అందుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. రాత్రి సమయంలో తినేందుకు అవకాడో కూడా మంచిదే. ఇందులో ఉండే మెగ్నిషియంతో మనకు మంచి నిద్ర వచ్చేందుకు దోహదపడుతుంది.

నల్ల ద్రాక్షతో..
నల్ల ద్రాక్ష కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇవి మెదడును బాగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తాయి. ఇందులో ఉండే మెలటోనిన్ ను నియంత్రిస్తాయి. వీటి వల్ల కూడా మంచి నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. డార్క్ చాక్లెట్ కూడా మన ఆరోగ్యానికి మంచివే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో రాత్రి సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తాయి. నిద్ర కూడా బాగా పట్టేందుకు సాయపడతాయి.