Snoring Problem: మనలో చాలా మంది నిద్ర పోతున్నప్పుడు గురక పెడుతుంటారు. దీంతో పక్కన ఉన్న వారికి నిద్ర పట్టదు. నిద్రలో గురక అనేది ఇతర జబ్బులకు సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గురకే కదా అని తేలిగ్గా తీసిపారేయకూడదు. గురకకు కూడా చికిత్స తీసుకుంటే మంచిది. లేకపోతే ఇతర పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు రావచ్చు. గురక గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. గురక వలన ఇతరులు చిరాకు పడుతుంటారు. గురక ఇతర వ్యాధులకు మూలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గురక ఎందుకు వస్తుంది? మనం నిద్ర పోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే గురక వస్తుంది. శ్వాసను వదులుతున్నప్పుడు మెడ, తలలోని మృదుకణజాలం వైబ్రేషన్స్ కారణంగా గురక వస్తుంటుంది. సెన్సిటివ్ కణజాలాలను ముక్కు రంధ్రాల ట్రాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటాయి. మనం నిద్ర పోయేటప్పుడు వాయు మార్గం రిలాక్స్ అవుతుంది. దీంతో ఆ సమయంలో గాలి బలవంతంగా లోపలికి వెళ్లడంతో కంపనాలు వస్తాయి. దీని మూలంగా గురక మనకు వస్తుంది.
ప్రతి రోజు గురక పెడుతున్నట్లయితే కొన్ని ప్రమాదకర సమస్యలు వస్తాయి. గురక ఎక్కువగా పెట్టే వారిలో గుండెపోటు ప్రమాదం అధికంగా ఉంటుంది. గురక గుండెపోటు ప్రమాదాన్ని నలభై శాతం పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురక శ్వాస సమస్యలు బీపీ వచ్చే రిస్క్ పెంచుతుంది. అధిక బరువు ఉన్న వారు బరువును కంట్రోల్ లో ఉంచుకోకపోతే గురక ముప్పు ఎక్కువవుతుంది. దీంతో గుండె జబ్బులు వ్యాపించే అవకాశాలను ఎక్కువ చేస్తుంది. అందుకే గురక పెట్టే వారు జాగ్రత్త సుమా.

నిద్ర పోయే పొజిషన్లో మార్పులు చేసుకోవాలి. వీలైనంత వరక పక్కకు తిరిగి పడుకోవడం ఉత్తమం. అలా చేస్తే గురక ముప్పు కొంత వరకు తగ్గవచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానేయాలి. అల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా గురక ప్రమాదం ఉంటుంది. శరీరం డీ హైడ్రేషన్ కు గురయితే కూడా గురక ముప్పు ఉంటుంది. వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటేనే మేలు. లేకపోతే గురక ముప్పు వెంటాడుతుంది. గురక అలవాటు ఉంటే జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం ఎక్కువే.