
Diabetes Control: మనదేశం డయాబెటిస్ కు రాజధానిగా మారుతోంది. ఎక్కువగా చైనా, ఇండియా దేశాలే దీనికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాల్లోనే అన్నం ఎక్కువగా తింటారు. అందుకే మధుమేహం ఇంతలా పెరుగుతోంది. కొందరిలో అపోహలు ఉన్నాయి. షుగర్ వస్తే జీవితాంతం పోదని అంటుంటారు. కానీ కఠినమైన నియమాలు పాటించడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి మనం కొన్ని కఠినమైన అలవాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఎవరు కూడా వాటిని పట్టించుకోవడం లేదు.
షుగర్ ఉన్న వాళ్లు పండ్లు తినవచ్చా?
డయాబెటిస్ ఉన్న వారు కూడా పండ్లు తినవచ్చు. కాకపోతే కొన్ని రకాల పండ్లు మాత్రమే తీసుకోవాలి. తీయగా ఉండే వాటి జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే అందులో కూడా షుగర్ ఉంటుంది. బొప్పాయి, కర్బూజ, జామ, పుచ్చకాయ, కమల, ఆపిల్, దానిమ్మ, నేరేడు, రేగు వంటి పండ్లను తినడం శ్రేయస్కరం. వీటితో మధుమేహానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఈ పండ్లలో కూడా ఫ్రక్టోజ్ రూపంటో చక్కెర ఉండటంతో తక్షణమే రక్తంలో కలవకుండా చేస్తాయి. అందుకే ఈ పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఏ పండ్లు తినకూడదు
షుగర్ ఉన్న వారు మామిడి, సీతాఫలం, సపోట, అరటి వంటి పండ్లను తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇవి రక్తంలో నేరుగా కలవడంతో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో మన దేహంలో చక్కెర ఎక్కువ అవుతుంది. వీటన్నింటిని మానేసి ఇడ్లీ, దోశలు ఎక్కువగా తింటుంటారు. అందులో కూడా షుగర్ ఎక్కువగానే ఉంటుంది. దీంతో షుగర్ ఉన్న వారు డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు తప్పవు. అందుకే మధుమేహం ఉన్న వారు జాగ్రత్తలు తీసుకుని మసలుకుంటే సమస్యలు రావు.
షుగర్ ఎవరికి వస్తుంది?
షుగర్ రావడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన విధానాల ద్వారా వస్తుంది. ఇంకా మన ఆహార అలవాట్ల వల్ల వస్తుంది. అన్నం ఎక్కువగా తింటే అది గ్లూకోజ్ రూపంలో మారి శరీరంలో పేరుకుపోతుంది. అదే మధుమేహంగా చెబుతారు. ఇలా మన దేశంలో ఎక్కువ మంది అన్నం తినడంతోనే షుగర్ వ్యాపిస్తోంది. షుగర్ ఉన్న వారు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్న వారు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

ఏం చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది?
షుగర్ ఉన్న వారు ఉదయం సాయంత్రం రెండు పూటలా వాకింగ్ చేయాలి. యోగా చేస్తుండాలి. దీంతో షుగర్, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇంకా ఆహారం విషయంలో కూడా కంట్రోల్ పాటించాలి. ఏది పడితే అది తినకూడదు. మధుమేహులు తినకూడనివి అసలు తీసుకోకూడదు. అన్నం మానేయాలి. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు ఏదైనా పండు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో రెండు పుల్కాలతో ఒక ఆకుకూర తీసుకుంటే మంచిది. సాయంత్రం సమయంలో డ్రైఫ్రూట్స్, వాల్ నట్స్, ఏదైనా పండు తీసుకుంటే మంచిది.