
Slim: ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. లావు అవుతున్నామనే ఉద్దేశంతో తిండి మానేసి ఇంకా ఎక్కువగా లావు అవుతున్నారు. పుండు ఒక చోట ఉంటే మందు ఒకచోట పెట్టినట్లు అధిక బరువును తగ్గించుకునేందుకు ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నా వారికి తెలియకపోవడంతో వాటిని పాటించడం లేదు. ఫలితంగా ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువును తగ్గించుకునేందుకు మనకు ఎన్నో ఉపాయాలు ఉన్నాయి.
అల్పాహారం చేసే ముందు..
ఉదయం పూట అల్పాహారం చేసే ముందు ఈ సూప్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనికి చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇంతకీ ఇది ఎలా తయారు చేసుకోవాలంటే వాము, జీలకర్ర, సోంపును తీసుకోవాలి. వాము ఒక రెండు చెంచాలు, జీలకర్ర రెండు చెంచాలు, సోంపు రెండు చెంచాలు తీసుకుని మిక్సి పట్టుకుని ఉదయం పూట అయినా రాత్రి భోజనానికి ముందు అయినా తాగడం వల్ల మనకు పలు రకాల సమస్యలు దూరం అవుతాయి.

వీటిని తీసుకోవడం..
వాము మనకు అజీర్తి కలగకుండా చేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. జీలకర్ర కూడా మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం సమస్యకు చెక్ పెడుతుంది. ఇక సోంపు కూడా మనకు డైజేషన్ బాగా కావడానికి సహకరిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు అయితే స్వీటు సోంపుకు బదులు నార్మల్ సోంపు వాడుకోవడం ఉత్తమం. ఇది మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది.
ఎప్పుడెప్పుడు..
ఈ జ్యూస్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. ఉదయం అల్పాహారం చేసే ముందు కానీ రాత్రి పూట భోజనం చేసే ముందైనా రోజు ఒకే సమయంలో తీసుకోవాలి. దీన్ని ఓ 50 రోజులు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. శరీర మెటబాలిజంను పెంచుతుంది. మలబద్ధకం సమస్యను లేకుండా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.