Diwali 2022: మన దేశంలో దీపావళి పండగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ భారతదేశంలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నరక చతుర్దశి రోజు దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీ. మహావిష్ణువు ఈ రోజు నరకాసురుడిని సంహరించాడనే పురాణాలు సూచిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. స్నేహితులకు, శ్రేయోభిలాషులకు బహుమతులు ఇస్తుంటారు. కానీ ఈ పండుగ వేళ కొన్ని వస్తువులు దానం చేయకూడదని మన పండితులు చెబుతున్నారు. దీంతో మనం ఎన్నో జాగ్రత్తలతో పండుగ జరుపుకుని సంతోషంతో ఉండటానికి ప్రయత్నించడం మంచిది.

దీపావళి పండుగకు దానాలు చేయడం చేస్తుంటారు కానీ కొన్ని రకాల వస్తువులను మాత్రం ఎవరికి ఇవ్వకూడదు. దీంతో మనం ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుంటే మేలు. ఈ రోజున మనం చేసే దానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు దానం చేయకకూడదు. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో పొరపాటున వీటిని దానంగా ఇస్తే మనకు చిక్కులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు కూడా ఇలా చేయడం మానుకోవాలి.
ఇంకా పర్ఫ్యూమ్ బహుమతిగా ఇవ్వకండి. దీని వల్ల శుక్రుడు బలహీనుడు అవుతాడు. దీంతో ఆర్థిక సమస్యలు వచ్చే సూచనలున్నాయి. కాబట్టి వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పర్ఫ్యూమ్ లను ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో గాజు వస్తువులకు భలే డిమాండ్ ఉంది. దీంతో వీటిని గిఫ్ట్ లుగా ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గాజు వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వల్ల సమస్యలే వస్తాయి. దీని వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.

దీపావళి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లోని ప్రతి మూల శుభ్రం చేయడం మరిచిపోవద్దు. వస్తువులను ఎలా పడితే అలా పడేయకూడదు. ఇంట్లో విరిగిన వస్తువులు ఉంచకూడదు. విరిగిన గడియారం, ఖాళీ సీసాలు, విరిగిన గాజు వస్తువులను ఇంట్లో ఉంచకుండా బయట పడేయాలి. లక్ష్మీ పూజకు ముందు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. ఈ సమయంలో ఇంట్లో మాంసాహారం ఉండకూడదు. చిరిగిన బట్టలు వేసుకోకూడదు.