Sleep Tips: మన జీవితంలో రెండే ప్రధానమైనవి ఉన్నాయి. ఒకటి తిండి రెండోది నిద్ర. ఆహారం తీసుకోవడం రాత్రి పూట నిద్రపోవడంతోనే మన జీవనం గడుపుతున్నాం. కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర ఉంటేనే మనం హాయిగా జీవించేందుకు అవకాశం ఉంటుంది. రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడంతో మన రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్లే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇలా నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఉపద్రవమే కలుగుతాయి.

మనం సరైన విధంగా నిద్రపోయేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి భోజనం చేసే సమయం కచ్చితంగా ఉంచుకోవాలి. రాత్రి పొద్దుపోయాక తినడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. గదిలో వెలుతురు ఉంటే మనకు సరైన విధంగా నిద్ర పట్టదు. అందుకే రాత్రి సమయంలో నిద్రపోయే ముందు గది చీకటిగా ఉండేలా జాగ్రత్త పడాలి. లేకపోతే మనకు నిద్ర పట్టదు. ఫలితంగా అనేక రోగాలకు మూలంగా నిలిచే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
పొద్దు పోయే వరకు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వాడకూడదు. ఎక్కువ సేపు వీటిని చూడటం వల్ల మనకు రేడియేషన్ కారణంగా మనకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే వీటిని ఎక్కువ సేపు చూడటంతో మన కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో నిద్ర కరువవుతుంది. ఫలితంగా మనకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అందుకే వాటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదని చెబుతుంటారు. వాటిని కచ్చితంగా పాటిస్తే మంచి నిద్ర మన వశమవుతుంది.

రాత్రిపూట మంచి సంగీతం వింటే కూడా ఫలితం ఉంటుంది. లేకపోతే మంచి పుస్తకాన్ని చదవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పోవడానికి ఇవి దోహదపడుతాయి. మనుసు ప్రశాంతంగా ఉంటుంది. చెవులకు ఇంపైన సంగీతం వింటే త్వరగా నిద్ర వస్తుంది. పుస్తకం చదివినా మన దృష్టి అక్షరాల మీద పడటంతో మనకు త్వరగా నిద్ర వచ్చే వీలుంటుంది. ఇలా సుఖవంతమైన నిద్ర పోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించుకుని నిద్ర పోవడానికి తగిన మార్గాలు అన్వేషించాలి. మంచి నిద్రతోనే మనకు అన్ని లాభాలు కలుగుతాయి.