Health Tips: పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ గుడ్డు మంచి పౌష్టికాహారం. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లను ఈ గుడ్డు బాగా అందజేస్తుంది. పోషకాహార లేమితో బాధపడే వారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా డాక్టర్లు సలహాలిస్తూ ఉంటారు. మరి రోజూ గుడ్డు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం రండి.

ఉదయం పూట అల్పాహారంగా గుడ్లను తీసుకోవాలి. అలా గనుక తీసుకుంటే చాలా సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. గుడ్డు మంచి ప్రోటీన్లతో పాటు ఆకలి వేయకుండా.. ఎక్కువెక్కువ ఆహారం తినకుండా కూడా చేస్తోంది. బరువు తగ్గడానికి కూడా గుడ్లు గొప్పగా తోడ్పడతాయి.
Also Read: మీకు ఈ క్రింది లక్షణాలు ఉంటే.. వెంటనే జాగ్రత్త పడండి !
ఉదయాన్నే అల్పాహారంగా గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్ స్థాయి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ కూడా బాగా దోహదం చేస్తాయి. అల్పాహారంగా పిండి పదార్థాలు అయినా ఉప్మాలు, బ్రెడ్లు వంటి వాటిని ఎక్కువగా తినకుండా గుడ్లు చేస్తాయి.

సహజంగా గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల కారణంగానే మధుమేహం, ఎముక జబ్బుల వంటి రోగాలు వస్తున్నాయి. అందుకే, నిత్యం గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
మీకు తెలుసా ? ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయం జబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం ఎంతో మేలు చేసే అంశం. గర్భిణులకు కూడా గుడ్డు ఎంతో అవసరం.
Also Read: ‘జై భీమ్’ ఖాతాలో మరో అరుదైన ఘనత !