Betel Leaves Plant: మనం దేవుడికి పువ్వులతో పాటు ఆకులు కూడా పెడతాం. ఇందులో తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తమలపాకులు ఆంజనేయుడికి చాలా ప్రీతిపాత్రం. అందుకే మంగళవారం, శనివారం తమలపాకుల మాల వేసి వేడుకుంటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టడమే కాకుండా వాటిని నోట్లో వేసుకోవడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ. ఇలా తమలపాకులతో మనం పలు కార్యక్రమాలు చేయడం సహజమే. తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకోవడం మంచిదా? కాదా? అనే విషయంపై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి.

తులసిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. విష్ణుమూర్తికి సంకేతంగా దీన్ని భావిస్తారు. ఇంటి ఆవరణలో కచ్చితంగా తులసి ఉండేలా చూసుకుంటారు. తులసి కోటకు నిత్యం పూజలు చేస్తుంటారు. పండుగలు, వ్రతాల్లో తాంబూలం ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇంటికి ముత్తయిదువలు వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇస్తుంటారు. తాంబూలాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఇంట్లో ఉన్న వారు తాంబూలంగా వేసుకుంటారు. పూర్వం రోజుల్లో ప్రతి రోజు భార్యాభర్తలు తాంబూలం వేసుకునే అలవాటు ఉండేది.
తమలపాకుతో పాటు సున్నం కలిపి వేసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. బాలింతలు కూడా 11వ రోజు నుంచి తాంబూలం వేసుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర పెట్టిన తాంబూలం కాకుండా చూసుకోవాలి. తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోకూడదు. అయితే వాటిని కోయకూడదు తినకూడదు అనే వాటిపై మాత్రం నియమాలు ఏమీ లేవు. తమలపాకు చెట్టు అన్ని ప్రదేశాల్లో పెరగదు. వేడిగా ఉండే ప్రదేశాల్లో ఈ చెట్టు ఎక్కువగా పెరగదు. తమలపాకును ముత్తయిదువులకు తాంబూలంగా ఇస్తుంటాం.

అందుకే తమలపాకు చెట్టును పెంచుకోవద్దు అనేది సరైంది కాదనే వాదన కూడా ఉంది. తమలపాకుతో మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం అవుతాయి. గొంతులో కఫాన్ని తగ్గిస్తుంది. దీంతో తమలపాకును దైవాంశ సంభూతంగా భావిస్తుంటారు. అందుకే తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటే మంచిదే. ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా తమలపాకుల అవసరం ఉంటుంది. వాటితోనే దేవుడిని కొలిచి దాన్ని తాంబూలంగా ఇంటికి వచ్చిన అతిథులకు అందించడం ఆచారంగా ఉంది.