Bats: మనదేశంలో వాస్తుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా వాస్తు ప్రకారం అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్నో సంప్రదాయాలు, విశ్వాసాలు ఉన్నాయి. బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అపశకునమని భావిస్తారు. కుక్క ఏడిస్తే అరిష్టమని విశ్వసిస్తారు. ఇంట్లోకి గబ్బిలం వస్తే అనర్థాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కొందరు మాత్రం గబ్బిలం రావడం శుభానికి సంకేతమని అనుకుంటారు. ఇది ప్రమాదమని ఇంకొందరు అంటున్నారు. దీంతో గబ్బిలం ఇంట్లోకి రావడాన్ని ఎలా భావించుకోవాలో తెలియడం లేదు. ఏదైనా జంతువు, పక్షి గాని అకస్మాత్తుగా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

గబ్బిలాలు దేవాలయాలు, మసీదుల్లో ఉంటాయి. లక్ష్మీదేవి వాహనం గబ్బిలం కావడంతో అదృష్టం వరిస్తుందని భావిస్తుంటారు. అందుకే గబ్బిలం ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు సంపన్నంగా ఉంటుందని చెబుతుంటారు. గబ్బిలం ఇంట్లోకి వస్తే చెడుకంటే మంచి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. గబ్బిలాలకు రాత్రి సమయంలోనే కళ్లు కనిపిస్తాయి. దీంతో అవి రాత్రి వేళల్లో ఇంటి ఎదురుగా వచ్చిందంటే ఇంట్లో ఎవరో చనిపోతారని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో గబ్బిలం ఇంట్లోకి వచ్చిందంటే ఎక్కువగా భయపడుతుంటారు.
గబ్బిలాలు ఇళ్ల దగ్గర ఎక్కువగా కనిపించవు. ఎప్పుడైనా ఇంటి దగ్గరకు వచ్చినా ఇంట్లోకి మాత్రం రావు. గబ్బిలాల గుంపు ఇంట్లోకి వస్తే వైవాహిక జీవితంలో కష్టాలు తప్పవని సూచిస్తుంటారు. ఒక్కోసారి గబ్బిలాల రాక కుటుంబంలో ఎవరైనా మరణించే సంకేతానికి గుర్తుగా భావిస్తారు. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని ఇంటికి రాకుండా తరమికొట్టాలి. అంతేకాని గబ్బిలాన్ని చంపడం శ్రేయస్కరం కాదు. గబ్బిలం రెక్కల్లో ఉండే బ్యాక్టీరియాతో ఇంటి వాతావరణం కలుషితంగా మారుతుంది.

గబ్బిలం ఇంట్లోకి వచ్చినట్లయితే పసుపు నీళ్లు చల్లి ఇల్లంతా శుభ్రం చేసుకుని తరువాత గుగ్గిలం పొగ వేయాలి. దీంతో గబ్బిలం రావడం వల్ల ఏర్పడిన దోషాలు తొలగిపోతాయి. గబ్బిలాన్ని చంపితే ప్రతికూల శక్తులు కలుగుతాయి. దీని వల్ల అశాంతి నెలకొంటుంది. గబ్బిలం వచ్చినప్పుడు ఆందోళన పడకుండా దాన్ని ఇంటికి రాకుండా చేసే మార్గాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోకి వస్తే ఇల్లును శుద్ధి చేసుకుని ఎనర్జీ పాజిటివ్ గా మారేందుకు ప్రయత్నించాలి. గబ్బిలం వల్ల వచ్చే నష్టాలపై జ్యోతిష్య పండితులు గబ్బిలం ఇంట్లోకి రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.