Blood Pressure Food: ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య రక్తపోటు. ఇది రావడానికి ముఖ్య కారణం ఉప్పే. సైలెంట్ గా మన ప్రాణాలు కబళిస్తున్న బీపీతో ఇబ్బందులు ఎదురవుతాయి. గుండెపోటు ప్రమాదం కూడా దీంతోనే ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీపీని కంట్రోల్ ఉంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుండెపోటు, స్ట్రోకులు, ధమనులలో రక్తం గడ్డ కట్టడానికి దారి తీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఒత్తిడి, ఉప్పు అధికంగా తీసుకోవడం వల్లే బీపీ సమస్య వస్తుందని చెబుతోంది. ఊబకాయం, ధూమపానం, మద్యపానం వంటివి రక్తపోటును పెంచుతాయి. ఈ నేపథ్యంలో బీపీని తగ్గించుకోవడానికి పలు మార్గాలు పాటించాల్సిందే.

రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలంటే ఆహార నియమాలు పాటించాలి. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. ప్యాకేజీ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల వాటిని దూరం పెడితేనే మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తినొద్దు. రక్తపోటును నియంత్రించాలంటే మనం తీసుకునే ఆహారాలే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మన భోజనంలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. బీపీని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి నష్టాలు ఉండవు. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది.
అధిక బరువు వల్ల కూడా రక్తపోటు సమస్య వస్తుంది. బరువును తగ్గించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది. అధిక బరువు వల్ల బీపీ వచ్చి పలు సమస్యలకు దారి తీస్తుంది. రోజు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ ఉంటే ధూమపానం మానేయండి. దీని వల్ల కూడా బీపీ పెరుగుతుంది. గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలు కూడా వచ్చే వీలుంటుంది. అందుకే ధూమపానం మానేయడమే మంచిది.

రక్తపోటు ఉన్న వారు ఆకుకూరలు తింటే ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో బచ్చలికూర, మునక ఆకు, తోటకూర, పాలకూర, మెంతికూర వంటివి చేర్చుకోవడం ఉత్తమం. యాంటీ ఆక్సిడెంట్లు బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. బీట్ రూట్ కూడా బీపీని తగ్గిస్తుంది. రక్త ప్రవాహం మెరుగుపరచడానికి ఇది దోహదం చేస్తుంది. అవకాడో బీపీ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, పోలేట్ లు ఎక్కువగా ఉండటంతో ఇది రక్తపోటును నియంత్రిస్తుందని చెబుతున్నారు.