https://oktelugu.com/

Periods: నెలసరి ఆగిపోయే ముందు కనిపించే లక్షణాలు ఏవో తెలుసా?

నెలసరి ఆగిపోయే ముందు మహిళలకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ప్రెగ్నెన్సీ లో లాగే మోనోపాజ్ సమయంలో డిఫరెంట్ లక్షణాలు వస్తాయి. వీటితో చాలా మంది బాధపడతారు.

Written By: Srinivas, Updated On : September 1, 2023 5:22 pm
Periods

Periods

Follow us on

Periods: ప్రతి మహిళకు నెలసరి తప్పనిసరిగా ఉంటుంది. ఇది జరిగిన సమయంలో వారు చాలా వీక్ అవుతారు. ఋతుచక్రసమయంలో చెడు రక్తాన్ని విసర్జిస్తారు. గర్భాశయంలోని ఎండోమెట్రియం అనే లోపలి పొర ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని రుతుస్రావం అంటారు. పూర్వకాలంలో నెలసరి సమయంలో ఏ పని చేయకుండా ఉండేవారు. ఋతుచక్రం ఆగిపోవడానికి మోనోపాజ్ అంటారు. మహిళలకు 50 ఏళ్ల వయసులో ఉండగా ఇది ఆగిపోతుంది. దీంతో ప్రస్తుతం 40 ఏళ్లకే మోనోపాజ్ ను పొందుతున్నారు. ఇలాంటి సమయంలో ఎటువంటి లక్షణాలు కలుగుతాయంటే?

నెలసరి ఆగిపోయే ముందు మహిళలకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు. ప్రెగ్నెన్సీ లో లాగే మోనోపాజ్ సమయంలో డిఫరెంట్ లక్షణాలు వస్తాయి. వీటితో చాలా మంది బాధపడతారు. కానీ పైకి చెప్పలేరు. కానీ కొందరు వైద్యులు మాత్రం వీటిని బయటపెట్టారు. రుతుక్రమం ఆగిపోయే సమయంలో ముందుగా మహిళలు చికాకును ఎదుర్కొంటారు. ఏ పని చేసినా వారికి నచ్చదు. ప్రతి విషయంలో కోపంగా ప్రవర్తిస్తారు.

మోనోపాజ్ సమయంలో మహిళలు ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే వారు పని మీద దృష్టి పెట్టరు. దీంతో యాజమాన్యం నుంచి ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటారు. ఇవే కాకుండా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. ఒంట్లో వేడి ఆవిర్లు వస్తాయి. చర్మంలో అనేక మార్పులు సంభవిస్తాయి. చర్మం కాంతిని కోల్పోతుంది. పొడిబారినట్లు అవుతుంది. ఆటోమేటిక్ గా బరువు పెరుగుతారు. జుట్టు రాలిపోతూ ఉంటుంది. నిద్ర అసలు పట్టదు.

ఈ లక్షణాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే రుతుక్రమం ఆగిపోతుంది. వీటిని చాలా మంది తమలో తామే కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇప్పటి వారు తమకున్న సమస్యలతో వైద్యులను సంప్రదించడం వల్ల వారి వయసును భట్టి అసలు విషయం చెబుతూ ఉంటారు. కొందరికి ఇలాంటి లక్షణాలు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్ బారిన పడేవారు సైతం ముందుగా ఇలాంటి లక్షణాలు ఏర్పడి రుతుక్రమం ఆగిపోతుంది. ఆ తరువాత జబ్బులు సంక్రమిస్తాయి. అయితే ఈ లక్షణాలు కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించి ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.