Immunity Boosters: ఈ మధ్య కాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంటోంది. ఈ నేపథ్యంలో రోగాలు చుట్టుముడుతుండటంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఏర్పడుతోంది. ఇరవై ఏళ్లకే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బులు, కాలేయ రోగాలు వ్యాపిస్తున్నాయి. మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. మందులే కాదు ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుని పాటించాలి.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే వాటిలో విటమిన్ సి ముఖ్యమైనది. ఇది నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ పండ్లలో అధికంగా ఉండటంతో వాటిని తీసుకోవడం మంచిది. దీంతో మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్లు ఎక్కువగా ఉండే కూరగాయల్లో టమాట, బంగాళాదుంపలు వైరస్ లను ఎదుర్కోవడంలో ముందుంటాయి. కనీనం వారానికి ఒకసారైనా తీసుకుంటే రోగ నిరోధక శక్తి రెట్టింపవుతుంది. మన శరీరానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలంటే వీటిని తీసుకోవడం ఉత్తమం.
శరీరం కోల్పోయిన యాంటీ బాడీలను తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. మన బాడీలో యాంటీ బాడీలు పెరగడానికి గుడ్లు, పెరుగు, పాలు, బీన్స్ ఉపయోగపడతాయి. రోజూ అరకప్పు క్యారెట్లు తినడంతో కెరోటిన్ దొరుకుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్, బి6 విటమిన్ యాంటీ బాడీ కణాల ఉత్పత్తికి దోహదపడతాయి. ఈనేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన విధంగా మన ఆహార అలవాట్లను మార్చుకోవాలి. అప్పుడే మనకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

రోజు నాలుగైదు ఖర్జూరాలు తీసుకోవడంతో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇవి రక్తహీనతను దూరం చేస్తాయి. దీంతో మనకు రోగనిరోధక శక్తి అనుమడిస్తుంది. గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదయం, సాయంత్రం దీన్ని తాగడం వల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తుంది. దీన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరిస్తున్నారు. చేపలు, పీతలు కూడా ఎక్కువగా తినాలి. ఇందులో కూడా రోగ నిరోధక శక్తి బాగా దొరుకుతుంది. గుండె జబ్బులను దూరం చేస్తాయి. పీతల్లో జింక్ అధికంగా ఉండటం వల్ల వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
ఆహారంలో మార్పులతో పాటు రోజు కనీసం ఓ నలభై ఐదు నిమిషాలు వ్యాయామం చేయడం మరిచిపోవద్దు. దీని వల్ల కూడా మన శరీరం ఉత్తేజంగా ఉంటుంది. రోజంతా హుషారుగా ఉండేందుకు సహకరిస్తుంది. శరీరం ఫిట్ గా మారుతుంది. ఈ క్రమంలో ఈ జాగ్రత్తలు తీసుకుని మంచి ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు మార్గాలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.