https://oktelugu.com/

Chanakya Niti: యవ్వనం కోల్పోకుండా ఉండాలంటే.. చాణక్యుడు ఎలాంటి సలహా ఇచ్చాడో తెలుసా?

ప్రస్తుత కాలంలో మనుషులు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్యంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రావడం ఆందోళనను కలిగిస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2024 / 01:40 PM IST

    Chanakya Niti

    Follow us on

    Chanakyaniti: ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకోసం ముందుగా డబ్బు సంపాదించడానికి మార్గాలను వెతుక్కుంటాడు. అయితే డబ్బు సంపాదించే క్రమంలో ఉద్యోగం, వ్యాపారం కోసం నిత్యం శ్రమిస్తున్నారు. ఉద్యోగం పురుష లక్షణం కావొచ్చు. కానీ పురుషులు మితిమీరిన కష్టాన్ని కోరుకుంటే మాత్రం ప్రమాదమేనని చాణక్య నీతి చెబుతుంది. అపర చాణక్యుడు తన వ్యూహాలతో మౌర్య సామ్రాజ్యాన్ని సక్రమ పద్ధతిలో నడిపించగలిగాడు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తన జీవితం ఆనందమయం చేసుకోవడానికి ఏం చేయాలో? ఏం చేయకూడదో? కొన్ని సూత్రాలను భవిష్యత్ తరాల వారికి ఆ కాలంలోనే చెప్పాడు. చాణక్య సూత్రాలను పాటించిన చాలా మంది తమ జీవితాలను చక్కదిద్దుకున్నారు. అయితే ఇటీవల మరణాల రేటు పెరిగిపోతుంది. పురుషు ఆయస్సు రేటు తగ్గుతోంది. పురుషులు తొందరగా మరణించడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ వారు త్వరగా యవ్వనం కోల్పోవడానికి మాత్రం ప్రధానమైన కారణం చెప్పాడు. ఏ వ్యక్తి అయినా తాను కొంత కాలం యవ్వనం గా కనిపించాలని కోరుకుంటాడు. కానీ ఆ వ్యక్తికి ఉండే అలవాట్లు, పద్ధతుల ద్వారా త్వరగా ముసలి వయసుకు దారి తీస్తున్నారు. అయితే చాణక్య చెప్పిన ప్రకారం ఓ పని చేయడం వల్ల తొందరగా యవ్వనాన్ని కోల్పోతారని అంటున్నారు. అయితే ఇది సాధారణంగా ఆరోగ్యకరమే అయినా పురుషుల విషయంలో మాత్రం ఇది అతిగా ఉండడం వల్ల నష్టం అంటున్నారు. మరి ఏం చేస్తే త్వరగా యవ్వనాన్ని కోల్పోతారో తెలుసుకుందాం..

    ప్రస్తుత కాలంలో మనుషులు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్యంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రావడం ఆందోళనను కలిగిస్తోంది. ఎక్కువగా కూర్చొని పనిచేయడం, నిద్రలేమి, ఒబిసిటీ, అధిక బరువు ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే నడకే ప్రధానం అని కొందరు వైద్యులు చెబుతున్నారు. ప్రతీరోజూ ఉదయం కొన్ని గంటల పాటు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. నడక వల్ల శరీరంలోని అదిక కేలరీలు కరిగే అవకాశం ఉందని కొందరు వైద్య శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు.

    అయితే ఈ నడక పరిమితి ఉండాలంటాడు చాణక్యుడు. ఆయన చెప్పిన నియమం ప్రకారం పురుషులు ఎక్కువగా నడకకు ప్రాధాన్యం ఇవ్వకూడదని అంటున్నారు. అతిగా నడవడం వల్ల శరీరంలో అధిక శక్తి విడుదలవుతుంది. దీంతో కణజాలం దెబ్బతింటుంది. ఇదే సమయంలో చర్మం కాంతి కోల్పోతుంది… అని చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా యవ్వనంలో ఉండే అబ్బాయిలు పరిమితికి మించి వ్యాయామం చేయడం గానీ.. అధికంగా నడవడం గానీ చేస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

    చాలా దూరం ప్రయాణించాలనుకునేవారు నడకను ఎంచుకోకుండా వాహనాలపై వెళ్లడానికి ఇష్టపడాలని చెప్పారు. యవ్వనంలో ఉండేవారు అనవసరమైన అధిక శ్రమకు దూరంగా ఉండాలని చెప్పారు. అప్పుడు ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉండగలుగుతారని చాణక్యుడు చెప్పారు.

    అందం విషయంలో ఆడవాళ్లు ఎక్కువగా కేర్ తీసుకుంటారు. కానీ పురుషుల్లోనూ కొందరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. చాణక్యుడు యవ్వన వయస్కులను సున్నితమైన పేపర్ తో పోల్చాడు. ఒక పేపర్ ఎండలో పెడితే దాని స్వభావం ఎలా ఉంటుందో..యవ్వనులు ఎండలో ఉండడం వల్ల అంతే కాంతిని కోల్పోతారని చెప్పారు. వీటితో పాటు ఎక్కువగా మద్యం సేవించినా, ధూమపానం వైపు వెళ్లినా.. చర్మంపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అందువల్ల యవ్వనంగా ఉండాలనుకునేవారు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.