Marriage Rules: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి అనేది అందరి కోసం కాకుండా తమ జీవితానికి ఒక తోడు కోసం, కష్టసుఖాలను పంచుకోవడం కోసం, వంశాభివృద్ధి కోసం చేసుకుంటారు. అలా ఆ జీవితం అనేది కడవరకు తోడు ఉంటుంది. ఇక భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. ఏ పని చేసిన ఇద్దరు కలిసి నిర్ణయించుకొని చేయాలి.

ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి. అలాగైతేనే జీవితం అనేది సాగుతుంది. లేదంటే లేని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొందరు భార్యలు భర్తలను అస్సలు లెక్క చేయరు. నువ్వెంత అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి భర్తలను గౌరవించాలి. పొరపాటున కూడా భర్తను అగౌరవపరచకూడదు. అందులో కొన్ని భర్తను అనకూడని మాటలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
భార్య తన భర్తను ఎప్పుడైనా ఏదైనా బంధువుల ఫంక్షన్లలో కానీ మరే ఇతర పబ్లిక్ ప్లేస్ లోనైనా కానీ తక్కువ చేసి, చులకన చేసి మాట్లాడకూడదు. దానివల్ల ఆయన గౌరవంతో పాటు ఆమెకు కూడా చెడ్డ పేరు వస్తుంది.
ఇక మెట్టినింటి విషయాలను పొరపాటున కూడా పుట్టింటికి చెప్పకూడదు. దీనివల్ల మరెన్నో సమస్యలు వస్తుంటాయి. పైగా పుట్టింటివాళ్లకు మెట్టినింటి వాళ్ళపై చెడు ప్రభావం ఏర్పడుతుంది.
ఇక భర్త గురించి చుట్టుపక్కల ఇంటి వాళ్లకు అసలు చెప్పకూడదు. కొందరు తమ భర్త అలా అంటున్నారని, ఇలా అంటున్నారని బయటకు చెప్పుకుంటారు. దీంతో ఆయనకు గౌరవం అనేది తగ్గుతుంది.
Also Read: రుద్రాణి చెంప పగలకొట్టిన వంటలక్క.. దీప ఒడిలోకి చేరుకున్న మోనిత బిడ్డ!
కొందరు భర్తలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెంటనే నీకు ఏం తెలుసని వాటిని నిరాకరించకూడదు. దానివల్ల వారికి ఏదైనా పనులు చేయాలన్న ఆసక్తి పోతుంది. కాబట్టి ఆ నిర్ణయానికి తగ్గట్టు సలహాలను ఇవ్వడం మంచిది.
మరి కొందరు తరచుగా పిల్లల ముందు భర్తలను తిడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు. ఏది ఉన్న తాము ఏకాంత సమయంలో మాట్లాడుకోవాలి తప్ప పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడదు.
Also Read: విడిపోయిన వారితో కలవడానికి ఈ 5 రాశుల వారు ఏ మాత్రం ఆలోచించరు..?
జబర్దస్త్ కు గుడ్ బై..Sudigali Sudheer Sensational Decision