Kidney Damage Symptoms: మన శరీరంలో ముఖ్యమైన భాగాలు మూత్రపిండాలు. ఇవి సక్రమంగా పనిచేస్తేనే మన మనుగడ ఉంటుంది. కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే ఇబ్బందులు వస్తాయి. రక్తసరఫరా సక్రమంగా సాగాలంటే కిడ్నీల పనితీరే ప్రధానం. మన ఒంట్లో ఉండే ఐదు లీటర్ల రక్తాన్ని ప్రతి గంటకోసారి ఫిల్టర్ చేస్తాయి. దీంతో మన శారీరక వ్యవస్థ బాగుంటుంది. రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేయకపోతే వ్యర్థాలు చేరి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవాలి.
కిడ్నీలు పాడయితే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇక డయాలసిసే దిక్కు. డయాలసిస్ అంటే మన ఒంట్లో రక్తాన్ని తీసి కొత్త రక్తం ఎక్కించడం. ఇది వారానికి రెండు సార్లు చేయించుకోవాలి. బతికినంత కాలం అలాగే చేయాలి. లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా మన శరీరం గుల్లబారిపోతుంది. అందుకే కిడ్నీలు సరిగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీలు చెడిపోతే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఆకలి మందగిస్తుంది. వాంతులు, వికారం వస్తుంటాయి. మూత్రం రంగు కూడా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స చేయించుకోవాలి. కిడ్నీల పనితీరు మెరుగుపడేందుకు కావాల్సిన ఆహారాలు తీసుకుని వాటిని సంరక్షించుకునేందుకు ప్రయత్నించాలి.
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలోని మలినాలు బయటకు పోవు. రక్తంలో కలుస్తాయి. దీంతో మన శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. కిడ్నీలు సరిగా ఉండాలంటే వాటికి మంచి ఆహారాలు ఇవ్వాలి. బాగుండేలా చూసుకోవాలి. వీపులో నొప్పి ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీల పనితీరు దెబ్బతిందని అర్థం చేసుకోవచ్చు. అందుకే కిడ్నీలను దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Recommended Videos: