
Break Up : భార్యాభర్తలంటే సంసారమనే కావడికి రెండు వైపులా ఉండే కుండల్లాంటి వారు. బ్యాలెన్స్ తప్పితే కుండలు పగిలిపోవడం ఖాయం. అందుకే సంసారం నిలవాలంటే ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం కావాలి. అప్పుడే దాంపత్యంలో గొడవలు లేకుండా సాఫీగా సాగుతుంది. అలాగని పూర్తిగా అల్లర్లు లేకపోతే కూడా బాగుండదు. చిన్న చిన్న గొడవలు ఉంటేనే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది. గొడవలు ముదిరితే తెగతెందపుల దాకా వెళ్తుంది. అదే చిన్నపాటి గొడవలా ఉంటే సాయంత్రానికి సద్దుమణుమనుగుతుంది. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందంటారు. ఆలుమగలు వారి జీవితంలో గొడవలు పడుతుండాలి. అవి సాయంత్రానికి పోతుండాలి. అప్పుడే వారి కాపురం చూడముచ్చటగా ఉంటుంది.
కొట్టుకోవడం
కొందరు మొగుడు పెళ్లాలు ఇరవై నాలుగు గంటలు గొడవలతోనే జీవిస్తారు. తెల్లారిందంటే మొదలు మాటల యుద్ధం పెరుగుతుంది. మాటలు తారాస్థాయికి వెళితే భౌతిక దాడులకు కూడా వెనకాడరు. చెంప దెబ్బలు కొట్టడం, తన్నడం వంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి వారితో వేగాల్సిన అవసరం లేదు. వారి దాంపత్య జీవితానికి ముగింపు పలకొచ్చు. అది మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. భాగస్వాములుగా ఇద్దరికి సమాన హక్కులుంటాయి.
మానసికంగా..
ఇంకా కొందరు భాగస్వాములు మానసికంగా వేధిస్తూ ఉంటారు. ప్రతి దానికి విమర్శించడం, అనుమానాలు పెంచుకోవడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. దీంతో ఎదుటి వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇలాంటివి భరించాల్సిన అవసరం లేదు. మనం కావాలనుకుంటే జీవిత భాగస్వామితో విభేదించొచ్చు. విడిగా ఉండేందుకు ప్రయత్నించొచ్చు. భరించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఏదైనా తెగేదాకా లాగితే దూరమే అవుతుంది కానీ దగ్గర మాత్రం కాదనే విషయం తెలుసుకోవాలి.

వివాహేతర సంబంధం
చాలా మంది ఇక్కడే దొరుకుతుంటారు. ఇంట్లో భాగస్వామి ఉండగానే సుఖం కోసం పరాయి వారిని ఆశ్రయిస్తారు. విషయం తెలిసినా కంటిన్యూ చేస్తారు. ఇలాంటి విషయాల్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లయితే వారిని క్షమించాల్సిన పనిలేదు. వారి బంధానికి ఉద్వాసన పలకమే సరైన నిర్ణయం అవుతుంది. కానీ చాలా మంది తమ సంసారం కకావికలం అవుతుందనే ఉద్దేశంతో సర్దుకుపోయే వారు చాలా మంది ఉంటున్నారు.
మద్యపానం
మగవారికి ఉండే చెడు అలవాట్లలో ఇది నూటికి తొంబై శాతం మందికి ఉండేదే. రాత్రయిందంటే చాలు ఫుల్ గా తాగి ఇంటికి రావడం అందరు చేసే పనే. ఇందులో కూడా భార్య ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. తను సంసారాన్ని పట్టించుకోకపోతే ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. అందుకే భార్య భర్త నుంచి నిరభ్యంతరంగా విడిపోవచ్చు. విపరీతంగా మద్యం సేవించి ఇల్లు గురించి పట్టించుకోకుండా ఉండే వారు చాలా మంది కనిపిస్తారు. వారందరు జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి.