https://oktelugu.com/

Harathi: దేవుళ్లకి హారతి ఇవ్వడం వెనుక ప్రాముఖ్యత తెలుసా..?

పురాణాలలోని ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో దేవుళ్ల విగ్రహలు బయటకు కనిపించడం కోసం హారతి ఇచ్చేవారని తెలుస్తోంది. వేదమంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తల నుంచి పాదం వరకు తిప్పుతూ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 19, 2023 / 04:11 PM IST

    Harathi

    Follow us on

    Harathi: సాధారణంగా దేవాలయాలతో పాటు ప్రతి ఇంటిలోనూ పూజ చేసిన తరువాత దేవుళ్లకి హారతి ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పురాతన కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. అయితే అసలు హారతి ఎందుకు ఇస్తారో? హారతి ఇవ్వడం వెనుక గల కారణాలు ఏంటనేది తెలుసుకుందాం.

    పురాణాలలోని ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో దేవుళ్ల విగ్రహలు బయటకు కనిపించడం కోసం హారతి ఇచ్చేవారని తెలుస్తోంది. వేదమంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తల నుంచి పాదం వరకు తిప్పుతూ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

    దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని చూపించడానికి హారతి ఒక పద్ధతి అని చెప్పుకోవచ్చని కొందరు చెబుతున్నారు. హరతి ఇవ్వడం అనేది నియమాలకు కట్టుబడి చేసే ఓ పవిత్ర కార్యంగా భక్తులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నిష్టగా, శుభ్రంగా ఉండటంతో పాటు మంచి వస్త్రాలు ధరించి దేవుళ్లకు హారతి ఇవ్వాలని తెలుస్తోంది.

    హరతి ఇచ్చే సమయంలో గంటను మోగించాలని చెబుతున్నారు. ప్రతికూల శక్తులు ఏమైనా ఉంటే వాటిని పారద్రోలడానికి ఈ గంట ఉపయోగపడుతుందంట. దీపం ముందు కర్పూరం వెలగించి దేవుడి ముందు కానీ, దేవత ముందు కానీ వృత్తాకారంలో తిప్పుతూ హరతి ఇవ్వాలి. ఆ తరువాత శుద్ధి చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి. అనంతరం దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు.

    అయితే దేవుళ్లకి హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మికతో పాటు మానసిక అంశాలు కూడా కలగలిపి ఉన్నాయని సైన్స్ చెబుతోంది. హారతి వృత్తాకార పద్దతిలో ఇవ్వడంతో పాటు లయబద్ధంగా గంట మోగించడం వలన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. ధూపం, కర్పూరం వంటి వాటి నుంచి వచ్చిన సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే దీపం వెలిగించడం ప్రతీక వాదానికి మించిందని సైన్స్ వెల్లడించింది. కాంతి మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని, అలాగే నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని సైన్స్ నిపుణులు చెబుతున్నారని తెలుస్తోంది.