Dry Fruits Benefits: మనం తీసుకునే ఆహారమే మనకు రక్షణగా నిలుస్తుంది. రోజువారీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రోగాలు వచ్చే ప్రమదం పొంచి ఉంది. శీతాకాలంలో మనకు చలి తీవ్రంగా ఉంటుంది. అందుకే మనం శరీరానికి వేడి చేసే పదార్థాలను తీసుకునేందుకు మొగ్గు చూపాలి. అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. అల్పాహారంలో అందరు ఇడ్లీ, దోశ, పూరీ, బజ్జీ వంటివి తీసుకుంటున్నారు. వీటితో ఆరోగ్యానికి ఇబ్బందులే ఎదురవుతాయి. కానీ పట్టించుకోవడం లేదు. ఏదో తింటూ ఆకలిని తీర్చుకోవడానికే నిర్ణయించుకుంటున్నారు. దీంతో మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటున్నాయి. డ్రై ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని పచ్చివి తినడం అంత శ్రేయస్కరం కాదు. రాత్రి పూట నానబెట్టుకుని ఉదయం పూట వాటిని తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. చాలా మంది వీటిని నానబెట్టకుండానే తింటారు. కానీ నానబెడితేనే అందులో ఉండే ప్రొటీన్లు మనకు దక్కుతాయి. అందుకే వాటిని నానబెట్టుకుని తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఉండే కొవ్వులు శరీరానికి అత్యంత శక్తిని కలిగిస్తాయి. వీటిని పోషకాహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డ్రైఫ్రూట్స్ లో మొదటిగా చెప్పుకునేది బాదం పప్పు. ఇది అత్యంత ఖరీదైనదిగా ఉన్నా మంచి ప్రయోజనాలు ఇస్తుంది. రాత్రి నానబెట్టుకుని ఉదయం పూట తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. వాల్ నట్స్ దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో వాల్ నట్స్ ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతున్నారు. బరువు తగ్గించడంలో కూడా ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి.
వాల్ నట్స్ ను పాలు లేదా నీళ్లలో నానబెట్టుకుని తినడం మంచిది. ఒత్తిడిని తగ్గిస్తాయి. కిస్ మిస్, ఎండు ద్రాక్ష కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎండుద్రాక్ష మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. నీటిలో నానబెట్టి ఉదయం తింటే మంచి ఫలితం వస్తుంది. పేగులను శుభ్రం చేస్తుంది. అంజీరా పండ్లు కూడా మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తున్నాయి. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. కొవ్వు, పిండి పదార్థాలు సమతుల్యంగా ఉండటంతో ఇవి ఎంతో మేలు చేస్తాయి.

మధుమేహం ఉన్న వారికి ఇవి మంచి ఆహారం. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. పీసీవోడీతో బాధపడే వారికి ఎంతో సాయపడుతుంది. ఎండు ఖర్జూరాలు కూడా డ్రైఫ్రూట్స్ లో మంచి ఆహారంగా పేరు తెచ్చుకుంది. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో ఆర్గానిక్ సల్ఫర్ అలర్జీలను తగ్గిస్తుంది. ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టుకుని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అల్కహాల్ తీసుకునే వారికి ఖర్జూరాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.