Honey : తీపి పదార్థాలు శరీరానికి చాలా హానికరం. అందరికీ ఈ పదార్థాలు పడవు. అయితే తేనె కూడా తీపి కదా.. దీన్ని తీసుకోవడం వల్ల కూడా ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయి కావచ్చని భయపడుతుంటారు. కానీ దీనికి సహజంగానే తీపిదనం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ను అందిస్తుంది తేనె. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. తేనెను రోజు తీసుకోవడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ తేనె.
శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. విటమిన్ బి, సి లను కలగలుపుకొని ఉంటుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ కూడా అందుతుంది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనె, కొంచెం పసుపు వేసుకొని తాగితే అలర్జీ, జలుబు వంటి సమస్యలు హామ్ ఫట్ అంటాయి. ఈ తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. దీని వల్ల అలెర్జీలు త్వరగా తగ్గుతాయి. అంతేకాదు ఈ తేనెలో ఉండే ఆల్కలీన్ గుణం వల్ల ప్రేగులను శాంత పరుస్తుంది.
ప్రతి రోజు తేనెను డైట్ లో తీసుకుంటే గ్యాస్, అసిడిటీలు దూరం అవుతాయి. వేడి నీటిలో తేనె కలిపి ఉదయం తీసుకుంటే జీర్ణక్రియకు మేలు జరగడమే కాదు.. మలబద్ధకం కూడా తగ్గుముఖం పడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో తేనె చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి కాబట్టి బరువు తగ్గుతారు. దీనికోసం గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి ఉదయమే ఖాళీ కడుపుతో తాగాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడి.. టాక్సిన్స్ దూరం అవుతాయి.
తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషించి గుండెకు మేలు జరిగేలా చూస్తాయి. ధమనుల సంకుచితాన్ని నివారిస్తాయి కూడా. ఈ విధమైన ప్రక్రియ వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. తేనెలోని ఫ్రక్టోజ్, గ్లూకోజ్ నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి శరీరానికి శక్తి అందుతుంది. అయితే ఈ తేనెను 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కల్తీ లేని తేనెను తీసుకోవాలి అని గుర్తు పెట్టుకోండి.