https://oktelugu.com/

Tulasi leaves: తులసి ఆకుల నీరు ఏ సమయంలో తాగితే.. ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసా?

రోజూ ఉదయం తులసి ఆకులను తిన్న లేదా దాని రసం తాగిన కూడా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి తులసి ఆకుల రసం తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2024 / 05:31 PM IST

    Tulasi leaves

    Follow us on

    Tulasi leaves: ఎంతో పవిత్రంగా పూజించే తులసి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది మహిళలు ఉదయం పూట తులసి మొక్కను పూజిస్తారు. దీనిని పూజించడం వల్ల మహిళలకు మేలు జరుగుతుందని నమ్ముతారు. అయితే మనం కొన్ని ఆలయాలకు వెళ్తే తులసిని ప్రసాదంగా కూడా ఇస్తారు. ఈ తులసి ఆకులను తినడం వల్ల సకల రోగాలు పోతాయని నమ్ముతారు. పూర్వం రోజుల్లో చిన్న ఆకు ముక్క అయిన కూడా తినేవారు. కానీ ఈ రోజుల్లో కనీసం ఎవరూ కూడా తినరు. ప్రసాదంగా ఇచ్చిన కూడా నచ్చలేదని పడేస్తారు. అయితే తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. రోజూ ఉదయం తులసి ఆకులను తిన్న లేదా దాని రసం తాగిన కూడా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి తులసి ఆకుల రసం తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    తులసి ఆకులో ఔషధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో బాగా ఉపయోగపడతాయి. కొందరు బలహీనంగా ఉండి ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం బారిన పడుతుంటారు. ఇలాంటి వారు తులసి ఆకులను తినడం లేదా రసం చేసుకుని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడతారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయం పూట తులసి నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ప్రమాదకర వ్యాధుల నుంచి కూడా తులసి బాగా కాపాడుతుంది. కొందరు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు తులసి నీటిని తాగడం లేదా ఆకులను తింటే వెంటనే సమస్య తీరిపోతుంది. వ్యక్తిగత సమస్యలు, వర్క్ బిజీ వల్ల ఆందోళన, ఒత్తిడిగా ఉంటే తులసి ఆకులను నమలండి. ఒత్తిడి నుంచి విముక్తి కలిగించే గుణాలు తులసిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటంతో పాటు జీర్ణ సమస్యలు రాకుండా ఉంచుతుంది.

     

    తులసి ఆకులను తినడమే కాకుండా వీటి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. ఈ నీరు తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు డిప్రెషన్ నుంచి విముక్తి కలిగిస్తుంది. అయితే తులసి ఆకుల రసాన్ని తయారు చేసుకోవాలంటే తాజాగా ఆకులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇందులో రెండు గ్లాసుల నీరు వేసి, బాగా మరిగించాలి. ఆ తర్వాత కాస్త తేనె కలుపుకుని నీటిని తాగితే ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సాయపడుతుంది. ఉదయాన్నే తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు యాక్టివ్‌గా ఉంటారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి వ్యాధికారక సమస్యలు రాకుండా కాపాడుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.