Hot Water Health Benefits: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేడి పదార్థాలనే తీసుకోవాలి. చలిగా ఉన్న వాటిని తీసుకోకూడదు. అజీర్తి సమస్య వేధిస్తుంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. మసాలాలు, ఫ్రైలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మంచినీరు మనకు ఔషధం లాంటిది. ఏ కాలమైనా మనం తాగేనీరు మనకు శ్రీరామరక్షగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తాగేనీరే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

ఉదయం పూట రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగితే ఎంతో లాభం ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉండదు. ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. వెచ్చని నీరు తాగితే మన శరీర భాగాలు ఉత్తేజితమవుతాయి. కండరాలు బిగుసుపోకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి నీరు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసం కలుగుతుంది. శరీరంలో వేడి పెరుగుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు కారణమవుతుంది.
వేడినీరు తాగడం వల్ల ముక్కుదిబ్బడ, ముక్కు పూడుకుపోవడం, మాటలో జీర, శ్వాస ఇబ్బందులు నయమవుతాయి. చలి, వణుకు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తగ్గిపోవడం ఖాయం. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలను పోయేలా చేస్తాయి. కొందరికి వయసు వచ్చాక శరీరం ముడతలు పడి వృద్ధుల్లా కనిపిస్తారు. ఉదయం పూట లేవగానే రెండు గ్లాసుల వేడి నీరు తాగితే దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే ఈ అలవాటును దినచర్యగా చేసుకుంటే మంచిది.

నెలసరిలో వచ్చే ఇబ్బందులు కూడా వేడి నీటితో తొలగిపోతాయి. ఆ సమయంలో ఉండే అలసట, విసుగు తగ్గుతాయి. మొటిమలు రాకుండా చేస్తాయి. చుండ్రు నివారిస్తాయి. జుట్టు కుదుళ్లు బలపడతాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ రసం పిండుకుంటే బరువు తగ్గుతారు. వేడి నీరు తాగడం వల్ల చర్మం పొడిబారదు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనల స్థాయి తగ్గుతుంది. ఇలా ఉదయం పూట వేడి నీరు తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగితే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దక్కుతాయి.