Diabetes Fruits: డయాబెటిస్.. ఇదీ దీర్ఘకకాలిక వ్యాధి.. వంశపారంపర్యంగా వస్తుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు చాలా మంది ఈ వ్యాధితో బాధడుతున్నారు. బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. మనం తినే ఆహారం ఆధారంగానే డయాబెటిస్ తీవ్రత ఆధారపడి ఉంటుంది. దీంతో చాలా మంది ఆహార నియంత్రణ పాటిస్తారు. కొందరు నియంత్రించుకోలేక అన్నీ తినేస్తుంటారు. అయితే పండ్లు డయాబెటిస్‌ను పెంచుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. అయితే కొన్నిరకాల పండ్లు డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చంటున్నారు వైద్యులు. డయాబెటిక్ పేషెంట్లు అరటిపండ్లకు దూరంగా ఉండాలి. అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.
ఈ పండ్లు మేలు..
1. జామపండు..
జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జామపండు తింటే రక్తం చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే జామ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.
2. బేరి పండ్లు..
పైనాపిల్ పండ్ల కంటే బేరి పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా ఈ పండును తినాలి. దీనిలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నందున పైనాపిల్స్ కంటే బేరిని ఆరోగ్యకరమైనదిగా ఆరోగ్య నిపుణులు భావిస్తుంటారు.
3. బొప్పాయి..
బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. హెపటైటిస్, హెచ్‌సీవీ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండును తినవచ్చు. బొప్పాయి మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళనల వంటి మానసిక రుగ్మతలను సైతం నివారిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
4. నారింజ పండ్లు
చెర్రీ పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. వీటికి బదులుగా నారింజ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచి ఎంపిక. నారింజలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చెర్రీస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. నారింజలో ఆ లక్షణాలు ఉండవు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే నారింజను భేషుగ్గా తినవచ్చు.
5. యాపిల్..
అరటి పండ్ల స్థానంలో మధుమేహం ఉన్నవారు యాపిల్ తీసుకోవడం మంచిది. యాపిల్‌లో చెక్కరస్థాయి తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు యాపిల్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.