
Quality Sleep Tips: మనకు తిండి ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ఏ వయసు వారికైనా నిద్ర చాలా కీలకం. అందుకే అన్ని వయసుల వారు కచ్చితంగా రాత్రి సమయంలో నిద్ర పోవాల్సిందే. లేకపోతే రోగాలు చుట్టుముడతాయి. అయితే వయసుకు తగ్గట్లుగా నిద్ర పోవాలి. నిద్రకు మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ప్రతి రోజు కచ్చితమైన సమయంలో నిద్ర పోతే అడ్డంకులు ఉండవు. సమయం తప్పితే ఆటంకం కలుగుతుంది. దీంతో నిద్ర సరిగా పోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం. ఈ నేపథ్యంలో నిద్రకు మనం తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే.
ఏ వయసు వారు..
నిద్ర ఏ వయసుల వారికి ఎంత అవసరమో తెలుసుకుని వయసుకు తగ్గట్లుగా నిద్ర పోవాల్సిందే. శిశువు నుంచి మూడు నెలల చిన్నారులు రోజుకు 12 గంటల నుంచి 14 గంటలు నిద్ర పోవాలి. 4 నెలల నుంచి 11 నెలల చిన్నారులు 12 గంటల నుంచి 15 గంటల నిద్ర అవసరం. ఒక సంవత్సరం నుంచి రెండు ఏళ్ల లోపు వారికి 11 గంటల నుంచి 14 గంటల నిద్ర ఉండాలి. 3 నుంచి 5 సంవత్సరాల వయసు వారికి 10 నుంచి 13 గంటల నిద్ర కావాలి. 6 నుంచి 13 ఏళ్ల వయసు వారికి 9 నుంచి 11 గంటల నిద్ర అవసరం. 14 నుంచి 17 ఏళ్ల లోపు వారికి 8 గంటల నుంచి 10 గంటలు నిద్ర పోవాలి. ఇలా అన్ని వయసుల వారికి నిద్ర కచ్చితంగా అవసరమే.
పెద్దవారైతే..
18 నుంచి 25 ఏళ్ల వయసు వారు 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి. 26 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్న వారికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. 65 ఏళ్లు దాటిన వారికి 7 నుంచి 8 గంటల నిద్ర కావాలి. ఇలా అన్ని వయసుల వారికి నిద్ర అత్యవసరమే. లేకపోతే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మనం నిద్రపోతేనే అవయవాలు సరైన విధంగా పనిచేస్తాయి. నిద్ర పోయే సమయంలో అవయవాలు విశ్రాంతి తీసుకుని లేచిన తరువాత చురుకుగా పనిచేసేందుకు ఆస్కారం ఉంటుంది.

సరిగా నిద్రపోయేందుకు..
రోజులో సరిగా నిద్ర పోకపోతే మనం తిన్న ఆహారం జీర్ణం కాదు. నీరసం ఉంటుంది. ఏ పని చేయడానికి వీలుండదు. ఇలా ఇబ్బందులు వస్తాయి. అందుకే మంచి నిద్ర పోయేందుకు చొరవ తీసుకోవాలి. రాత్రి పూట డిన్నర్ తొందరగా ముగించాలి. దీంతో నిద్ర కూడా త్వరగా వస్తుంది. పడుకునే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. వెలుతురు ఉండే కళ్లపై ప్రభావం పడుతుంది. మంచినిద్ర పోవాలంటే మంచి పుస్తకం చదివితే కూడా నిద్ర తొందరగా పడుతుంది. ఇలాంటి చిట్కాలు పాటించి సరైన నిద్ర పోయేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం.