Reading Books: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక పుస్తకం కొనుక్కో అంటారు. పుస్తకం చదివితే ఎన్నో లాభాలున్నాయి. చాలా విషయాలు పుస్తకాలు చదవడంతోనే వస్తుంది. బుక్ నాలెడ్జ్ మనల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అందుకే మేధావులు పుస్తకాలు చదివే తమ మేథస్సును పెంచుకుంటారు. ఈ నేపథ్యంలో మన ఇంటిలో పుస్తకాలు ఉంచుకోవడంతోపాటు వాటిని చదివేందుకు ఉత్సాహం చూపిస్తే మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు పుస్తకాలు చదివేలా అలవాటు చేయాలి. మంచి పుస్తకం చదివితే ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. పుస్తకాలు చదివే అలవాటును చేసుకుంటే దాంతో మనకు ఎంతో ఆనందం కలుగుతుంది.

పుస్తకాలు చదవడం పిల్లలతోపాటు పెద్దలకు కూడా మంచిదే. పుస్తకాలు చదవడం వల్ల మానసిక సమస్యలు దూరం అవుతాయి. తెలివితేటలు పెరుగుతాయి. పుస్తకాలతో స్నేహం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. పుస్తకాలు చదివే వ్యక్తులు ఒత్తిడికి తక్కువగా గురవుతారు. పుస్తకం చదువుతున్నప్పుడు అందులో మునిగిపోవడంతో సమస్యలను పట్టించుకోం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తరచు ఒత్తిడికి గురయ్యే వారు పుస్తకాలు చదివితే అది దూరం అవుతుంది.
పుస్తకాలు చదివితే నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్ఫూర్తిదాయకమైన కథలు చదివితే వాటి వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది. దీంతో మనసు తేలికగా ఉంటుంది. ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. అందుకే పుస్తక పఠనం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. బాధ, దుఖం, నిరాశ కలిగినప్పుడు పుస్తకం చదివితే వాటి నుంచి బయటపడొచ్చు.

పుస్తకాలు చదవడం వల్ల మన ఆలోచనా శక్తి మారుతుంది. చెడు అలవాట్లను దూరం చేసుకోవచ్చు. సమస్యల నుంచి బయటపడేందుకు పుస్తకాలు మంచి నేస్తాలుగా ఉంటాయి. ఇటీవల కాలంలో అందరు మొబైల్, టీవీలకు అతుక్కుపోతున్నారు. కానీ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే ఎన్నో బాధల నుంచి విముక్తి కావచ్చు. ఇష్టమైన పుస్తకాన్ని చదవడంలో ఉన్న ఆనందం వేరేగా ఉంటుంది. గబగబ చదివేయకుండా అర్థం చేసుకుంటూ చదివితే అందులో ఉండే మజా తెలుస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారు పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మంచినిద్ర పడుతుంది. ఎలాంటి బాధలు, ఒత్తిడులు దరి చేరకుండా పుస్తక పఠనం మనకు సాయపడుతుంది. నిద్రపోయే ముందు పుస్తకం చదివితే మనకు గాఢ నిద్ర పడుతుంది. మానసిక ఆరోగ్యం కలగాలంటే పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడమే సరైన మార్గం.