Ragi Health Benefits: రాగులతో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. రాగులతో చేసుకునే పదార్థాలతో మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. రాగులు అత్యంత బలవర్థకమైన ఆహారం. దీంతో వాటిని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఆకలి వేయదు. దాహంగా ఉండదు. అందుకే ఎండాకాలంలో రాగి జావను తీసుకుని శారీరక వ్యవస్థను కాపాడుకుంటాం. రాగులు వాడకంతో వృద్ధాప్య ఛాయలు రావు. ఇందులో ఉండే అమైనో యాసిడ్లు త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి. బరువు తగ్గడానికి కూడా రాగులు ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా రాగులు ఎంతో మేలు చేస్తాయి.

ఎముకలు దృఢంగా కావడానికి రాగులు ఉపయోగపడతాయి. నిద్రలేమిని దూరం చేస్తాయి. రాగులను రోజువారీ ఆహారంలో తీసుకుంటే శక్తి లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. పిల్లలకు ఆహారంగా ఇస్తే వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రాగుల పానీయం తాగడం వల్ల దాహం తీరుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. అందుకే రాగులను రోజు వాడుకుంటే ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనకు కనిపిస్తాయి. రాగి జావతో ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో మజ్జిగ, ఉప్పు వేసి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.
జావలో పంచదార, పాలు కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో పిల్లలకు ఈ జావ తాగిస్తే బలమైన వారుగా ఎదుగుతారు. ఎముకలు పుష్టిగా తయారవుతాయి. ఎదుగుదల బాగుంటుంది. మేథోశక్తి పెరుగుతుంది. రాగులతో తయారు చేసిన పదార్థాలతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. మన శరీరానికి రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే మన ఆహారంలో రాగులను చేర్చుకోవడం ఉత్తమమే. ఆరోగ్య నిపుణులు కూడా ఇదే విషయం చెబుతున్నారు.

రాగుల ఆహారం మనిషికి ఎంతో శ్రేయస్కరం. రాగుల పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. జావగా కాచుకోవచ్చు. ఇంకా లడ్డూలుగా తయారు చేసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా రాగులు మనకు బలమైన ఆహారం అవుతాయి. మన శరీర వ్యవస్థను మెరుగుపరిచే దివ్య ఔషధంగా మారుతాయి. ప్రతి రోజు ఆహారంలో ఏదో రూపకంగా రాగులు తీసుకుంటే మంచిది. ఈ విషయం అందరు గ్రహించుకుని రాగులతో చేసిన పదార్థాలను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.