
Benefits of Drinking Water : నీరు అన్ని ప్రాణులకు జీవనాధారమే. నీరు తాగనిదే ఏ జీవి కూడా జీవించదు. మంచినీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు కడుపుకు విశ్రాంతి ఇవ్వడంతో లేచిన వెంటనే నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓ గ్లాస్ నీరు తాగడం వల్ల రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా మారుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో కదలికలు త్వరగా వస్తాయి. మలబద్ధకం ఇబ్బందిగా ఉండదు.
జీర్ణక్రియ
ఉదయాన్నే నీళ్లు తాగడం ద్వారా జీర్ణక్రియ బాగుంటుంది. రోజంతా ఎక్కువ కేలరీలు ఖర్చు కావడానికి సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయం గ్లాస్ వాటర్ తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. పరగడుపున నీళ్లు తాగడం వల్ల కడుపులో ఎసిడిటి తగ్గుతుంది. జీర్ణక్రియలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తుంది. ఇంకా చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. చర్మం ప్రకాశవంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
కిడ్నీ సమస్యలు
ఉదయం పూట నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లేలా చేస్తాయి. మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కిడ్నీల్లో రాళ్లు, ఇతర సమస్యలు తొలగించేందుకు కారణమవుతుంది. రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఉదయం నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఎసిడిటిని తగ్గిస్తుంది. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి.

ఇంకా
ఉదయం నీళ్లు తాగడం వల్ల మనకు పలు లాభాలు కలుగుతున్నాయి. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో నీళ్లు ఎంతో సాయపడతాయి. వేస్టేజీని రక్తం నుంచి మూత్రం, మలం ద్వారా పంపించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. దీంతో ఉదయం పూట గ్లాస్ నీళ్లు తాగడం వల్ల మన శరీరం ఎంతో లాభ పడుతుంది. మలినాలు బయటకు పోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో మంచినీళ్లు తాగడం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఉదయం తాగడమే పనిగా పెట్టుకుంటే ఇంకా మంచిది.